Radha Spaces ASBL

డల్లాస్ లో తానా ఆధ్వర్యంలో పేదల సహాయార్ధం ‘ఫుడ్ డ్రైవ్’ నిర్వహణ

డల్లాస్ లో తానా ఆధ్వర్యంలో పేదల సహాయార్ధం ‘ఫుడ్ డ్రైవ్’ నిర్వహణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన “తానా DFW Team” ఆధ్వర్యంలో పేదల సహాయార్ధం ‘ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్’ మరియు ‘నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ కు “తానా డాలస్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమంలో 9000 మందికి పైగా ఒక్కరోజుకి సరిపడే వివిధ రకాల పలు ఆహార ధాన్యాలు, క్యాన్డ్ ఫుడ్ మరియు నిత్యవసర సరుకులు అందజేశారు.

మనకు జీవనోపాధి, ఎదుగుదలకు ఎన్నో సదుపాయాలు కల్పించిన అమెరికా కు మనం ఎంతో ఋణపడి వున్నాం అని, ఇక్కడ నివసిస్తున్న పేదవారికి, తిరిగి మనవంతు తోడ్పాటు అందించాలనే సదుద్దేశంతో తానా “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి గత కొన్ని సంవత్సరాలుగా ‘తానా’ సహాయ సహకారాలను అందిస్తుంది అని తెలియజేశారు.

‘తానా’ ప్రవాసంలో వున్న తెలుగువారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా వుందన్నారు.

పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్స్ గా డా. ప్రసాద్ నల్లూరి, శేషగిరి గోరంట్ల తమ ఉదారతను చాటుకున్నారు, వీరితో పాటు  శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, పరమేష్ దేవినేని, అశోక్ కొల్లా, రవీంద్ర చిత్తూరి, వెంకట్ తొట్టెంపూడి, కిృష్ణమోహన్ దాసరి, మధుమతి వైశ్యరాజు, రాజ నల్లూరి, మల్లు వేమన, సతీష్ కోటపాటి, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు, విజయ్ వల్లూరు, అరవింద జోస్యుల, నాగరాజు నలజుల, లెనిన్ వీరా, వెంకట్ బొమ్మ, అప్పారావు యార్లగడ్డ, లక్ష్మీ పాలేటి,  రఘురామ్ పర్వతనేని, తదితరులు విరాళాలు అందించారు. కార్యక్రమంలో ‘తానా’ కార్యవర్గం, కమిటీ సభ్యులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ చేపట్టడానికి సహకరించిన “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి, ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.

‘తానా’ మరిన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో అమెరికాతో పాటు మాతృగడ్డ పై ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని సంస్థలతో కలసి,పనిచేసేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా బృందం సహకారంతో  మరెన్నో మంచి కార్యక్రమాలను మీముందుకు తీసుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023లో ఫిలడెల్ఫియా కన్వెషన్ సెంటర్ లో, జూలై 7,8,9 వ తేదీలలో నిర్వహించే 23వ తానా మహాసభల్లో తెలుగు వారు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలికారు!

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :