MKOne TeluguTimes-Youtube-Channel

కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ సిబ్బందికి లూకాస్ పరికరం అందచేసిన తానా ప్రతినిధులు

కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ సిబ్బందికి లూకాస్ పరికరం అందచేసిన తానా ప్రతినిధులు

న్యూ జెర్సీ రాష్ట్రములో సౌత్ బ్రున్స్విక్ నగరంలో పూర్తి సేవా దృక్పధంతో పని చేస్తున్న ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ సిబ్బంది కి సుమారు 15 లక్షల విలువైన లూకాస్( మెకానికల్ చెస్ట్ కంప్రెషన్ పరికరం) తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఓరుగంటి, విద్యాధర్ గారపాటి, బోర్డు అఫ్ డైరెక్టర్ లక్ష్మి దేవినేని, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి సమక్షంలో ఇవ్వటం జరిగింది. ఈ డివైస్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడటానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఏడాది అమెరికా లో సుమారు మూడున్నర లక్షల మంది గుండె పోటుతో మరణిస్తున్నారని సకాలంలో కానీ సి పి ఆర్ చేస్తే చాలా మందిని బ్రతికుంచుకునే అవకాశం ఉంటుంది అని కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ చీఫ్ శ్రీని వల్లూరి తెలిపారు.

కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ ఎటువంటి లాభాపేక్ష (ఒక్క డాలర్ కూడా బాధితుల నుండి తీసుకోరు) లేకుండా కేవలం సేవా దృక్పధంతో పని చేస్తున్న వాళ్ళకి తానా లాంటి సేవా సంస్థలు ప్రోత్సహించడం చాలా అభినందనీయం అని సౌత్ బ్రున్స్విక్ నగర మేయర్ చార్లీ కార్లెయ్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిల్ విమెన్ అర్చన గ్రోవర్, టౌన్షిప్ మేనేజర్ బ్రయాన్ బిడ్లక్. పోలీస్ చీఫ్ రేమండ్ హాయ్దుకే, లియుటేనంట్ జాన్ పెన్నేయ్ , పోలీస్ ఆఫీసర్స్ జారెడ్ హార్ప్ స్టర్ అండ్ ఆఫీసర్ కిమ్ చీఫ్ అఫ్ కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ శ్రీని వల్లూరి, కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ రెస్పాండెర్స్ టీం సభ్యులు, కీర్తన గారపాటి తానా ప్రతినిధులు రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ నారెపలేపు, శ్రీనాథ్ కోనంకి, రవి కొల్లి, శ్రీనివాస్ చెరుకూరి మరియు సతీష్ మేకా పాల్గొన్నారు. తానా సేవా కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా లో ఎప్పుడూ ఉంటాయి అని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు, ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :