తానా కల్చరల్ కాంపిటీషన్స్ 2024 ముహూర్తం ఫిక్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మిడ్ అట్లాంటిక్ తానా కాంపిటీషన్స్‌కు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్‌లోఫుగెట్ మిడిల్ స్కూల్ వేదికగా ఈ కాంపిటీషన్ జరగనుంది. ‘వాయిస్ ఆఫ్ తానా’, ‘తానా అల్టిమేట్ డ్యాన్స్ ఛాంపియన్స్’, ‘తానా డ్యాన్స్ జోడీ’ విభాగాల్లో ఉత్సాహవంతులంతా పోటీ పడొచ్చు. సోలో సింగింగ్, గ్రూప్ డ్యాన్స్ పోటీలు సబ్ జూనియర్ (9 ఏళ్లలోపు వయసు), జూనియర్స్ (9 నుంచి 14 ఏళ్ల వయసు), సీనియర్స్ (15 నుంచి 25 ఏళ్ల వయసు) విభాగాల్లో జరుగుతాయి. తానా డ్యాన్స్ జోడీలో మాత్రం 25 ఏళ్ల వయసు పైబడిన జోడీలు మాత్రమే పాల్గొంటాయి. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వారు వెంటనే https://tinyurl.com/TANA-MID-ATLANTIC-2024Cultural లింకులో రిజిస్టర్ చేసుకోవాలని తానా కోరుతోంది.