ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్ లో కోలాహలంగా తానా క్రికెట్ సంబరాలు

డల్లాస్ లో కోలాహలంగా తానా క్రికెట్ సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్‌ స్పోర్ట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ‘క్రికెట్‌ టోర్నమెంట్‌’ను మే 28 తేది నుంచి 30 మే తేదీ వరకు నిర్వహించారు. ముందుగా డల్లాస్‌ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ, తానా ఫౌండేషన్‌ కోశాధికారి శ్రీకాంత్‌ పోలవరపు, తానా కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌  లోకేష్‌ నాయుడు, తానా డిఎఫ్‌డబ్ల్యు స్పోర్ట్స్‌ సమన్వయకర్త వెంకట్‌ బొమ్మ, రాజేష్‌ చెరుకుపల్లి, క్రీడాకారులకు స్వాగతం పలికి, క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ సారధ్యంలో తానా జాతీయ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ సమన్వయంతో మరిన్ని మంచి మంచి క్రీడా కార్యక్రమాలను మీముందుకు తీసుకు వస్తున్నాం అని, తానా కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు.

క్రీడాకారులు, ఔత్సాహికులు క్రికెట్‌ ఆట ఆడాలంటే డల్లాసులో మాత్రమే ఆడాలి అనుకునే విధంగా తెలుగు అసొసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా అన్నిహంగులు కలిగిన స్థానిక రసెల్‌ క్రీక్‌ పార్కు క్రీడా సముదాయంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ ఆటలపొటీలకు  గ్య్రాండ్‌ స్పాన్సర్‌ గా దేవాన్ష్‌ ల్యాబ్స్‌, గోల్డ్‌  స్పాన్సర్‌ గా టెక్‌ స్టార్‌, ఈవెంట్‌ స్పాన్సర్స్‌ గా శ్రీకాంత్‌ పోలవరపు, సతీష్‌ కొమ్మన ముఖ్య దాతలుగా వ్యవహరించారు.

ఇరవై జట్లు, మూడు వందల యాభై మంది క్రీడాకారులు, స్వచ్చంద కార్యకర్తలు అమితమైన ఉత్చాహంతో పాల్గొన్నారు. అహో అనే విధముగా మంచి ప్రావీణ్యముతో 6 లు, 4 లు.. బలమైన షాట్లు కొడుతూ క్రీడాకారులు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

తానా విన్నర్‌ కప్‌ ను టెక్నీ హైర్‌ టైగర్స్‌ (కెప్టెన్‌ గంగాధర్‌ వంకాటీమ్‌), రన్నర్‌ అప్‌ కప్‌ ను విల్లో వారియర్స్‌ (కెప్టెన్‌ రాజా అడైకలసామీ టీమ్‌) జట్లు గెల్చుకున్నాయి. విన్నర్స్‌ టీమ్‌ కు $1500 ప్రైజ్‌ మనీ తో పాటు ట్రోఫీ మరియు మెడల్స్‌, రన్నర్‌ అప్‌ టీమ్‌ కు $750 ప్రైజ్‌ మనీ తో పాటు ట్రోఫీ మరియు మెడల్‌ ఇచ్చి ఘనంగా సత్కరించారు. 

బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఆఫ్‌ ది సీరీస్‌ గా విల్లో వారియర్‌ టీమ్‌ నుంచి ఏకలవ్య , బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది సీరీస్‌ గా రాజా అడైకలసామీ, ఆల్‌ రౌండర్‌ ఆఫ్‌ ది సీరీస్‌ గా టెక్నీ హైర్‌ టైగర్‌ టీమ్‌ ఆటగాడు - శివ శంకర్‌  కొమరి గెల్చుకొని అందరి మన్ననలు పొందారు.

తానా డల్లాస్‌ ఆర్‌విపి సతీష్‌ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ, తానా కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ లోకేష్‌ నాయుడు, తానా ఫౌండేషన్‌ కోశాధికారి శ్రీకాంత్‌ పోలవరపు, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్‌ మురళి వెన్నం క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని, పాల్గొన్న అందరికీ దన్యవాదాలు తెలియజేసి, విజేతలను అభినందించారు

తానా డల్లాస్‌ వివిధ కమిటీ  సబ్యులు లెనిన్‌ వీర, చినసత్యం వీర్నపు, ప్రమోద్‌ నూతేటి, సుధీర్‌ చింతమనేని, దిలీప్‌ చండ్ర,క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తానా డిఎఫ్‌డబ్ల్యు స్పోర్ట్స్‌ సమన్వయకర్త వెంకట్‌ బొమ్మ స్వచ్చంద కార్యకర్తలు, గ్రౌండ్‌ ఇచ్చిన సిటీ ఆఫ్‌ ప్లేనో, కుల్జీత్‌ సింగ్‌, అంపైర్‌ లకు ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :