తానా, బాటా ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ సూపర్ సక్సెస్

అగ్రరాజ్యంలో తానా, బాటా సంయుక్తంగా నిర్వహించిన వాలీబాల్/త్రోబాల్-2022 పోటీలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని నెవార్క్ వేదికగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. ఈ టోర్నీలో 50 పైగా జట్లు పాల్గొన్నాయి. మహిళలు, పురుషులకు వేరు వేరుగా అడ్వాన్స్, ఇంటర్మీడియట్, రిక్రియేషన్ అనే మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. వీటిలో 250 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అశేషంగా విచ్చేసిన ప్రేక్షకులు.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. తానా నార్తర్న్ కాలిఫోర్నియాలో రీజనల్ రిప్రజెంటేటివ్ అయిన రామ్ తోట, సెక్రటరీ సతీశ్ వేమూరితోపాటు బాటాకు చెందిన ప్రసాద్ మంగిన, హరినాథ్ చీకోటి, వీరు వుప్పల బృందం ఈ టోర్నీ నిర్వహణకు కృషి చేసింది. టోర్నీ ముగిసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, జట్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సేకరించిన నిధులను సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తామని వెల్లడిరచారు.
ఈ సందర్భంగా రామ్ తోట మాట్లాడుతూ.. టోర్నీని విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్లు శివ్ శేఖర్, మనీష్, దివాకర్, హరి వినోద్, శివ కుమారి, గౌతమి, దీప్తి, తానా నార్తర్న్ కాలిఫోర్నియా బృందం, బాటా బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే టోర్నమెంట్‌కు మద్దతుగా నిలిచి, అది ఘనంగా జరిగేందుకు సహకారం అందించిన స్పాన్సర్లు, తానా అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.