రెండుసార్లు గుండె ముక్కలైందంటున్న మిల్కీ బ్యూటీ
తమన్నా సౌత్ ఇండియన్ హీరోయిన్ గా ఉన్నంత కాలం ఆమె గురించి ఎఫైర్లు, బ్రేకప్ అనే వార్తలు ఎప్పుడూ రాలేదు. కానీ ఇక్కడ అవకాశాలు తగ్గాక బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఎక్కువ సినిమాలు, సిరీస్ లు చేయడం మొదలుపెట్టిన తమన్నా గురించి ఈ వార్తలు రావడం మొదలయ్యాయి. విజయ్ వర్మతో తమన్నా రిలేషన్‌షిప్‌లో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఇదంతా తాము నటిస్తున్న వెబ్ సిరీస్ కోసం చేస్తున్న స్టంటే అన్నారు. కానీ ఇప్పటికీ వారిద్దరూ కలిసే బయట కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా రీసెంట్ గా తన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే తాను రెండుసార్లు ప్రేమలో విఫలమైనట్లు చెప్పింది. ఇప్పటికే తన గుండె రెండు సార్లు ముక్కలైందని, ఆ రెండు సందర్భాల్లో తనకెంతో బాధగా అనిపించిందని, మొదటిసారి టీనేజీలో లవ్ లో దెబ్బ తిన్నట్లు చెప్పింది తమన్నా.
ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతను కూడా తనకు సెట్ కాడనిపించిందని, ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవాడని, అలాంటి వ్యక్తితో రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లడం ప్రమాదమనిపించి దాన్ని ముగించినట్లు చెప్పింది తమన్నా. అయితే తమన్నా పాత బ్రేకప్స్ గురించి చెప్పింది కానీ ఇప్పుడు విజయ్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాత్రం తమన్నా ఏమీ స్పందించలేదు.