నా రాజకీయ జీవితం ... ఎన్టీఆర్ పెట్టిన భిక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచిది కాదన్నారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని, తన ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మర్చిపోనని ఆయన తెలిపారు.







Tags :