చార్లెట్ తెలుగు అస్సోసిఏషన్ వారి దసరా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి

చార్లెట్ తెలుగు అస్సోసిఏషన్ వారి దసరా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి

చార్లెట్ తెలుగు అసోసియేషన్ వారి దసరా దీపావళి సంబరాలు కొత్త TAGCA కమిటీ అధ్వర్యంలో ఉదయం నుండి రాత్రి వరకు నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా, ఇంతకు ముందెన్నడు జరగని రీతిలో అత్యద్భుతంగా జరిగింది. 1000 మందికి పైగా తెలుగు వారు హాజరై దాదాపు పది గంటలపాటు సాగిన చిన్నరుల సాంస్కృతిక కార్యక్రమాలు, అపై జరిగిన సంగీత విభావరిని కన్నుల విందుగా వీక్షించారు.

చార్లెట్ తెలుగు అస్సోసిఏషన్ వారి దసరా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.  ప్రతిస్టాత్మకమైన నైట్ థిఏటర్లో అత్యధ్భుతమైన కార్యక్రమాలతో చార్లెట్ నగరం లోని తెలుగు వారు ఈ వేడుకలని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. నైట్ థిఏటర్ ప్రాంగనం అత్యద్భుతమైన అలంకారంతో ముస్తాబయ్యింది. ఆహ్వానితులకి ఏర్పాటు చేసిన సింహద్వారం, ఫోటో బూత్‌లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

మధ్యాహ్నం చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యకామాలతో మొదలై, రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతాయకంగా కొనసాగాయి. యువతకు రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు అందజేసారు. ముఖ్యంగా తెలుగు సంగీత విభావరి అత్యంత మనోరంజకంగా సాగింది.  

మన తెలుగు ప్రముఖ గాయని గాయకులు మనో, గీతా మాధురి, శ్రీకృష్ణ, శ్రీకాంత్ మరియు శ్రుతి పాటలతో పాటు మెహర్ బ్యాండ్ చార్లెట్ తెలుగు ప్రజలని ఉర్రూతలూగించాయి. గాయనీ గాయకుల సంగీతంతో పాటు సాహిత్య అద్భుతమైన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. TAGCA కార్యవర్గం గాయనీ గాయకులని, సంగీత బృందాన్ని ప్రత్యేకంగా సత్కరించింది.                     

నృత్య గానాలతో పాటు పట్టుకుంటే కంచి పట్టు చీరలు, బంగారు మరియు వెండి రేఫల్స్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చార్లెట్ తెలుగు వారు అద్భుతమైన ఈ ఈవెంట్ ని కని విని ఎరుగని రీతిలో అత్యంత ఆడంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిధులు, ప్రేక్షకులు TAGCA కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ప్రశంసలతో ముంచెత్తారు.

 

 

 

Tags :