కంగువలో సర్ప్రైజ్లకు నోరెళ్లబెట్టడం ఖాయమట!
సౌత్ నుంచి రానున్న భారీ బడ్జెట్ సినిమాల్లో కంగువ(Kanguva) ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), శిరుత్తై శివ(Siruthai Siva) కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్ఞానవేల్ రాజా(Gnanavel Raja నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా కచ్ఛితంగా ఆడియన్స్ ను మరో లోకంలోకి తీసుకెళ్తుందని సూర్య ముందు నుంచే చెప్తున్నాడు.
రీసెంట్ గా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య కంగువపై ఉన్న తన నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశాడు. కంగువ ఆడియన్స్ తో పాటూ ఫిల్మ్ మేకర్స్ ను కూడా ఆశ్చర్యపరుస్తుందని, ఈ సినిమాలోని విజువల్స్ కు అందరూ నోరెళ్లబెట్టడం ఖాయమని, కంగువలో చాలా సర్ప్రైజ్లు కూడా ఉంటాయని సూర్య ఊరిస్తున్నాడు.
ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ(Karthi) కూడా నటించాడనే రూమర్ ఇప్పటికే బయటికొచ్చింది. కాష్మోరా(Kashmora) సినిమాలోని గెటప్ లో కార్తీ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. ఇది కాకుండా మరెన్నో కూడా సర్ప్రైజ్లు ఉండి ఉండాలి. అందుకే సూర్య సర్ప్రైజ్ అని కాకుండా సర్ప్రైజ్లు అంటున్నాడు. మొత్తానికి సూర్య మాత్రం ఎప్పటికప్పుడు కంగువపై హైప్, ఆసక్తి పెంచుతూనే ఉన్నాడు.