ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలి : సుప్రీం కోర్టు

దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలి : సుప్రీం కోర్టు

బీజేపీ నేత నుపుర్‌ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఓ టీవీ చర్చలో మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల అనంతరం పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఉయద్‌పూర్‌లో ఓ టైలర్‌ను హత్య చేయడానికి కూడా నుపుర్‌ వ్యాఖ్యలే కారణం. అయితే దేశవ్యాప్తంగా తనపై నమోదు అయిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఢల్లీికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని సుప్రీంకోర్టులో నుపుర్‌ శర్మ పిటిషన్‌ వేసింది. ఈ నేపథ్యంలో ఆ పటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే వ్యక్తిగతంగా బాధ్యురాలని, యావత్‌ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని కోర్టు తెలిపింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :