అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూపు పై హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు ప్యానల్ తప్పుపట్టింది. అదానీ కంపెనీ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నిపుణుల కమిటీ తెలిపింది. రెగ్యులేటరీ వైఫల్యం కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్ తన రిపోర్టులో తెలిపింది. అదానీ గ్రూపునకు క్లీక్ చిట్ ఇస్తున్నట్లు ఆ ప్యానల్ వెల్లడిరచింది. అయితే సెబీ మరింత విచారణ చేపట్టాలని, ఆ తర్వాతే దీనిపై పూర్తి నమ్మకం కలుగుతుందని సుప్రీం ప్యానల్ తెలిపింది. అదానీ గ్రూపు ధరలను మార్చి చూపలేదని, షేర్ల ధరలు పెరిగినట్లు ఎక్కడా కృత్రిమంగా చూపెట్టలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ వెల్లడిరచింది. రిటేల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో సరైన విధానాలను పాటించినట్లు ప్యానల్ తెలిపింది. అదానీ కంపెనీ తీసుకున్న చర్యల వల్ల స్టాక్ మార్కెట్‌లో నమ్మకం పెరిగిందని ప్యానల్ చెప్పింది. ప్రస్తుతం ఆ కంపెనీ స్టాక్స్ స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నది.