ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వివేకా హత్యకేసులో ... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్యకేసులో ... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే ఇప్పుడున్న అధికారిని కొనసాగించండని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం, కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :