ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సుచరిండియా కొత్త ప్రాజెక్టు ప్రారంభం

సుచరిండియా కొత్త ప్రాజెక్టు ప్రారంభం

రియల్‍ ఎస్టేట్‍ రంగంలో ఎన్నో ప్రాజెక్టులతో పేరు పొందిన సుచరిండియా ఆధ్వర్యంలో మరో కొత్త ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు. హైదరాదాబాద్‍లోని మాదాపూర్‍లో జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి అక్కినేని సమంత ఈ కొత్త ప్రాజెక్టు ద టేల్స్ ఆఫ్‍ గ్రీక్‍ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. హైదరాబాద్‍ నగరం వేగంగా అభివ•ద్ధి చెందుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల సరైన ప్రాంతం హైదరాబాద్‍ అని సమంత చెబుతూ, ఇప్పటికే హైదరాబాద్‍ రియల్‍ ఎస్టేట్‍రంగంలో ఎన్నో నూతన ప్రాజెక్టులు, సంస్థలు వస్తున్నాయని చెప్పారు. సుచరిండియా సంస్థ చైర్మన్‍, సీఈఓ లయన్‍ డాక్టర్‍ కిరణ్‍ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్‍ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఐటీ కారిడార్‍ నిలయంగా వైవిధ్యభరితమైన పరిశ్రమలు, ఫార్మాసిటీ రావడంతో పాటు అంతర్జాతీయస్థాయిలో రోడ్లు, విమాన కనెక్టివిటీ ఉందని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న ప్రాంతం హైదరాబాద్‍ అని గర్వంగా చెప్పవచ్చని అన్నారు.

ఈ నూతన ప్రాజెక్టులను శంషాబాద్‍ వద్ద శాతంరాయ్‍ అనే చోట 2.5 ఎకరాల విస్తీర్ణంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇందులో గేటెడ్‍కమ్యూనిటీ పరిధిలో లగ్జరీ సూట్లు, స్టూడియో అపార్ట్మెంట్లతో పాటు క్లబ్‍హౌస్‍, ల్యాండ్‍ స్కేప్‍లు, పార్కులు వంటి వాటిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. రూ.175కోట్లతో ది టేల్స్ ఆఫ్‍ గ్రీక్‍ అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతోందని దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్లాట్స్లో హోమ్‍ ఆటోమేషన్‍ విధానం, బిజినెస్‍ లాంజ్‍లను కూడా అందిస్తున్నామన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్స్లో రూ.45లక్షల ప్రారంభ ధరనుంచి ప్లాట్లు అందిస్తామన్నారు. 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తిచేసి వినియోగదారులకు అందిస్తామని, ప్రధానమంత్రి ఆవాస్‍ యోజన కింద సుమారు 2.65కోట్ల సబ్సిడీని పొందే అవకాశం ఉందన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :