సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'తెలుసు కదా'తో అలరించబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. నీరజ కోన, సిద్దు స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలని నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.
ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఇందులో టాకీ సీన్స్, మ్యూజిక్ నెంబర్స్ షూట్ చేస్తున్నారు. రాశీ ఖన్నా మొదటి రోజు షూటింగ్లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ కావడం, ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ మూవీ గ్రాండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ను సూచిస్తుంది.
నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.