Radha Spaces ASBL

శ్రీశైలంలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో దసరా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో లవన్న ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను మొదలు పెట్టారు. శైలపుత్రిగా శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివనున్నారు. శ్రీశైల పురవీధులో బృంగివహంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరుగనుంది. అక్టోబరు 4 మహర్నవమిరోజు రాష్ట్ర ప్రభుత్వంచే స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ జరగనుంది. ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, కల్యాణోత్సం యథావిధిగా కొనసాగనుంది. భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలలో చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. నేటి నుంచి వివిధ అలంకార రూపాలలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్‌ 5 వరకు ప్రతిరోజు వివిధ వాహన సేవలలో స్వామి అమ్మవారికి క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :