స్వాగ్ తో శ్రీవిష్ణు రిస్క్
ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని వినోదాన్ని అందిస్తూ అలరించే శ్రీవిష్ణు త్వరలో స్వాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అక్టోబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అంటే ఎన్టీఆర్ దేవర1 వచ్చిన వారానికే స్వాగ్ థియేటర్లలోకి రాబోతుంది.
ఓ రకంగా ఇది చాలా పెద్ద సాహసమే. దేవర మీద ఆడియన్స్ కు ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మీద నమ్మకంతో నిర్మాతలు ఏకంగా మిడ్ నైట్ షోలు ప్లాన్ చేస్తున్నారంటే అవుట్‌పుట్ బాగా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు వారం గ్యాప్ లో శ్రీవిష్ణు తన సినిమాను రిలీజ్ చేయడం ఓ రకంగా రిస్కే.
ఒకవేళ దేవరకు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే కనీసం మూడు వారాల పాటూ స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే జరిగితే ఆ టైమ్ లో స్వాగ్ కు స్క్రీన్స్ షేర్ చేసే విషయంలో ఇబ్బందులు రావడం ఖాయం. పైగా అక్టోబర్ 11న అదే బ్యానర్ నుంచి విశ్వం రిలీజ్ కానుంది. మొత్తంగా చూసుకుంటే ఓ వైపు దేవర, మరోవైపు విశ్వం, వేట్టయాన్ సినిమాల వల్ల స్వాగ్ కు రిస్క్ అయితే ఉంది. ట్రైలర్ చూశాక స్వాగ్ మీద అంచనాలైతే పెరిగాయి. ఈ కాంపిటీషన్ లో స్వాగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కంటెంట్ బావుంటే ఎంత పోటీ ఉన్నా సరే ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించొచ్చు అది వేరే విషయం.