ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప రాజ్ కోసం కాలు క‌ద‌ప‌నున్న లీల‌మ్మ‌

పుష్ప రాజ్ కోసం కాలు క‌ద‌ప‌నున్న లీల‌మ్మ‌

ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప‌2(Pushpa2) రిలీజ్‌కు ఇంకా నెల రోజులే టైముంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో షూటింగ్ ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిత్ర యూనిట్ చూస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పెండింగ్ ఉన్న షూటింగ్ లో అతి ముఖ్య‌మైన‌ది ఐటెమ్ సాంగ్.

పుష్ప‌2లో స్పెష‌ల్ సాంగ్ కోసం గ‌త కొంత‌కాలంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్ కావాల‌ని వెతుకుతున్న సుకుమార్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల‌(Sree Leela)ను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా చెప్ప‌లేదు కానీ ఇప్ప‌టికే డీల్ కుదిరింద‌ని టాక్. ఇది నిజ‌మైతే బ‌న్నీ(Bunny) ఫ్యాన్స్ కు ఇంత‌కంటే గుడ్ న్యూస్ ఉండ‌దు.

ఈ ఇయ‌ర్ టాలీవుడ్ టాప్ డ్యాన్సింగ్ నెంబ‌ర్ గా నిలిచిన కుర్చీ మ‌డ‌త‌పెట్టి(Kurchi Madathapetti) సాంగ్ లో శ్రీలీల వేసిన స్టెప్పులు మ‌హేష్ బాబు(Mahesh Babu)కే డబుల్ ఎన‌ర్జీని తెప్పించింది. అలాంటి శ్రీలీల ఇప్పుడు స్టైలిష్ స్టార్(Stylish Star) తో జ‌త క‌డితే ఆడియ‌న్స్ ఇక కుర్చీల్లో కూర్చోవ‌డం క‌ష్ట‌మే అని చెప్పాలి. ఈ స్పెష‌ల్ సాంగ్ లో శ్రీలీలతో పాటూ స‌మంత కూడా ఉండే అవ‌కాశాలున్నాయంటున్నారు. చూడాలి మ‌రి పుష్ప‌2 కోసం సుకుమార్ ఇంకా ఏమేం ప్లాన్ చేశాడో! 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :