స్పెషల్ డ్రైవ్ తో పాస్ పోర్ట్ సేవలు
ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్‌తో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. 700 సాధారణ అపాయింట్‌మెంట్లను బుధవారం సాయంత్రం 4 నుంచి 4:30 గంటల మధ్య విడుదల చేస్తామని పేర్కొన్నారు. 12,650 అదనపు అపాయింట్‌మెంట్లలో 550 అపాయింట్‌మెంట్ల చొప్పున ప్రతి శుక్రవారం విడుదల చేస్తామని తెలిపారు. నిత్యం 10-15 శాతం పాస్‌పోర్ట్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. అపాయింట్‌మెంట్ సమయంలోనే అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేయాలని సూచించారు. మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని, వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు.
Tags :