బావ, అల్లుడితో బాలయ్య అన్‌స్టాపబుల్..! సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రోమో!!

బావ, అల్లుడితో బాలయ్య అన్‌స్టాపబుల్..! సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రోమో!!

ఆహాలో బాలయ్య నిర్వహిస్తున్న షో అన్‌స్టాపబుల్. ఇప్పుడో రెండో సీజన్ తో ముందుకొచ్చింది. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ రికార్డులు తిరగరాసింది. దీంతో ఆహా యాజమాన్యం మరోసారి బాలయ్యతోనే రెండో సీజన్ తో ముందుకొచ్చింది. తొలి ఎపిసోడ్ లో బాలయ్య తన బావ, అల్లుడితో రచ్చ చేయబోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రోమో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ లో రాజకీయాల నుంచి కుటుంబ విషయాలు, పార్టీ సంక్షోభం.. తదితర అన్ని విషయాలనూ చర్చించినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

చంద్రబాబు సీరియస్ పొలిటీషియన్. ఆయన్ను ఒక టాక్ షోకు పిలిచి ఫన్ జనరేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ సాహసం చేశాడు బావమరిది బాలయ్య. తన అన్ స్టాపబుల్ 2 సీజన్లో తొలి ఎపిసోడ్ కు గెస్ట్ గా చంద్రబాబును ఆహ్వానించాడు. చంద్రబాబుతో బాలయ్య ముచ్చట్లు ఓ రేంజ్ లో సాగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. కాసేపు సరదాగా, మరికాసేపు సీరియస్ గా సాగిన ఈ ఎపిసోడ్ లో కుటుంబ వ్యవహారాలతో పాటు ఎన్టీఆర్ తో సంక్షోభసమయం, మంగళగిరిలో లోకేశ్ ఓటమి, స్విమ్మింగ్ పూల్ లో లోకేశ్ జలకాలాటలు.. లాంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.

బావగారూ.. నువ్ చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటని చంద్రబాబును అడిగినప్పుడు.. ఆయన కూడా ఎంతో సరదాగా.. నీకంటే ఎక్కువే చేసాననడంతో బాలయ్య షాక్ తిన్నారు. మీరు సినిమాల్లో రొమాన్స్ చేస్తే.. నేను స్టూడెంట్ గా చేశానన్నారు. బైక్ సైలెన్సర్ తీసేసి.. అని ఏదో చెప్పబోయారు. అంతేకాదు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. తాను కలిసి తెగ తెరిగామన్నారు చంద్రబాబు. మీ లైఫ్ మీరు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏది అని అడిగినప్పుడు.. 95 డెసిషన్ అన్నారు చంద్రబాబు. అంతేకాదు.. అప్పుడు మనం కలిసి తీసుకున్న నిర్ణయం తప్పా.. అని బాలయ్యనే ప్రశ్నించారు. అదంతా తనకు ఇంకా గుర్తుందన్నారు బాలయ్య. కాళ్లు పట్టుకుని అడుక్కున్నానని.. ఆయన ఎప్పటికీ తన ఆరాధ్య దైవమని.. తన గుండెల్లో ఉంటారని చంద్రబాబు వెల్లడించారు. మా చెల్లిని ఎలా పిలుస్తావ్ బావా అని అడిగినప్పుడు.. భువి అని పిలుస్తానన్నారు చంద్రబాబు.. అంతేకాదు.. భువనేశ్వరికి కాల్ చేసి బాలకృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయానని ఫిర్యాదు చేశారు.

చివర్లో లోకేశ్ కూడా ఎపిసోడ్ లో సందడి చేశారు. బావగారిని ఈ డ్రెస్ లో కాకుండా మరో రూపంలో ఎప్పుడైనా చూశావా అని అడిగినప్పుడు.. యూరోప్ వెళ్లినా, మాల్దీవులకు వెళ్లినా ఇదే డ్రెస్ లో ఉంటారన్నారు లోకేశ్. అంతటితో ఆగని బాలయ్య.. మంగళగిరిలో ఓటమి పైనా ప్రశ్న సంధించారు. అయితే ఆనాడు ఒక సంకల్పంతో ముందుకెళ్లానని చెప్పారు. అంతేకాదు.. లోకేశ్ అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఫోటో చూపించి.. ఇది అసెంబ్లీ దాకా వెళ్లిందన్నారు. దీన్ని చూసి మీరేమంటారు అని చంద్రబాబును అడిగారు బాలయ్య. అల్లుడిపై నీకు లేని ఇబ్బంది నాకెందుకని చంద్రబాబు బదులిచ్చారు.

అదే సమయంలో తాను కాసేపు హోస్టింగ్ చేస్తానన్న లోకేశ్.. తన తండ్రి, మామయ్యను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరిలో ఎవరు కుకింగ్ బాగా చేస్తారని ప్రశ్నించారు. నేనే ఎప్పుడూ వండలేదన్న చంద్రబాబు.. ఇక ఆవిడకు ఏం వండిపెడతానని ఎదురు ప్రశ్నించారు. ఇద్దరిలో భార్య మాట ఎవరు వింటారని ప్రశ్నించినప్పుడు.. ఓపెన్ గా చెప్పడానికి తన ఈగో అడ్డు వస్తోంది అల్లుడూ.. అని బదులిచ్చారు బాలకృష్ణ. అంతేకాదు.. తండ్రికొడుకులిద్దరూ కలిసి తన కాపురంలో నిప్పులు పోస్తున్నారని దెప్పిపొడిచారు. ఇలా అన్ స్టాపబుల్ 2 సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం నారా - నందమూరి ఫ్యామిలీ ఈవెంట్ గా మారిందని చెప్పొచ్చు. 

 

 

Tags :