Radha Spaces ASBL

రాహుల్ పాదయాత్రపై పాజిటివ్ టాక్..! కాంగ్రెస్ రాత మారుతుందా?

రాహుల్ పాదయాత్రపై పాజిటివ్ టాక్..! కాంగ్రెస్ రాత మారుతుందా?

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో.. ఎవరు ఎన్నికవుతారో తెలియని పరిస్థితి ఉంది. అది పార్టీ అంతర్గత వ్యవహారం.. పార్టీ చూసుకుంటుంది అన్న భావనలో తన పని తాను చేసుకుపోతున్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారాయన. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే దేశమంతా ఏకం కావాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన యాత్రపై ఎంతోమంది పెదవి విరిచారు. పాదయాత్ర ప్రారంభించకముందే రాహుల్ యాత్రను పూర్తి చేస్తారా అనే సందేహాలూ వ్యక్తమయ్యాయి. యాత్రను మధ్యలోనే వదిలేసి విదేశాలకు పారిపోతారనే సెటైర్లు కూడా వినిపించాయి. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒక్క రోజు మాత్రమే యాత్రకు విరామం ఇచ్చారు. మిగిలిన అన్ని రోజులూ యాత్ర అనుకున్న ప్రకారం ముందుకు సాగుతూనే ఉంది.

రాహుల్ గాంధీ యాత్రను మెయిన్ మీడియా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ సోషల్ మీడియా మాత్రం రాహుల్ యాత్రను బాగా ప్రమోట్ చేస్తోంది. రాహుల్ యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. రాహుల్ స్థానికులతో ముచ్చటించడం, విద్యార్థులు, రైతులు, ట్రాన్స్ జెండర్లు, వ్యాపారులు, మహిళలు, కాలేజీ స్టూడెంట్స్.. ఇలా అన్ని వర్గాలను కలిసి వారితో చర్చలు జరుపుతున్నారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. వారు చెప్తున్న అంశాలను నోట్ చేసుకుంటున్నారు.

రాహుల్ యాత్రపై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ నడుస్తోంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్రను ప్రధాన మీడియాలో రాకుండా బీజేపీ తొక్కేస్తోందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీతో నడిచినవాళ్లు, ఆయనతో మాట్లాడిన వాళ్లు ... ఆయనపై ఉన్న నెగెటివిటీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీని పప్పు అంటూ బీజేపీ విమర్శిస్తుంటుంది. అయితే రాహుల్ తో మాట్లాడిన తర్వాత ఆయన పరిపక్వత ఏంటో తెలుస్తుందని.. ఆయన దేశానికి కచ్చితంగా కాబోయే ప్రధాని అని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ మంచి చేస్తాడో లేదో చెప్పలేం కానీ.. దేశానికి చెడు మాత్రం చేయరని మరికొందరు చెప్తున్నారు. ఆయనలో దేశం పట్ల అంకితభావం కనిపిస్తోందని.. మంచి చేయాలనే తపన ఉందని ఆయనతో మాట్లాడిన వాళ్లు పోస్టులు పెడ్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తవుతుంది. అప్పటికి రాహుల్ గాంధీలో రాజకీయ పరిపక్వత కచ్చితంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలపైన పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారని.. మూడు నెలలకోసారి విదేశాలకు వెళ్లిపోయి రెస్ట్ తీసుకుంటారని ఇప్పుడు ఆయన పైన ఉన్న నెగెటివి అంశాలు. వీటిని ఆయన ఎదుర్కోగలిగితే కచ్చితంగా రాహుల్ గాంధీకి మంచి ఫ్యూచర్ ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి కచ్చితంగా ప్రజల మద్దతు దక్కుతుందని.. ఆ టైం కోసం రాహుల్ ఎదురు చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం రాహుల్ గాంధీ టైం ఎప్పుడొస్తుందో..!

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :