ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సినీ వజ్రయుగంలో మైత్రి మూవీ మేకర్స్ సంచలనం

సినీ వజ్రయుగంలో మైత్రి మూవీ మేకర్స్ సంచలనం

తెలుగు సినీ పరిశ్రమ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91లోకి ప్రవేశించింది. ఇన్నేళ్ళ సినిమా యుగంలో ఎన్నో సంచలనాలు, మెరుపులను తీసుకువచ్చిన నిర్మాణ సంస్థలు ఎన్నో ఉన్నాయి. అందులో నాటి నుంచి నేటి వరకు చూస్తే పలు నిర్మాణ సంస్థలు తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిశ్రమ స్థాయిని పెంచాయి. నేటికాలంలో ఈ నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీస్‌ది ప్రత్యేకం అని చెప్పవచ్చు. భారీ తారాగణంతో, అగ్ర దర్శకులతో, టాప్‌ మోస్ట్‌ టెక్నీషియన్స్‌తో, భారీ చిత్రాలను నిర్మించడంతో ఈ సంస్థ పేరు అచిరకాలంలోనే సినీపరిశ్రమతోపాటు తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తనదైన బ్రాండ్‌ను సృష్టించుకుంది.

` రాంబాబు వర్మ లంక
సినిమా జర్నలిస్ట్‌

పూర్వరంగంలో తెలుగు సినిమా పుట్టుక...

తెలుగు సినిమా హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు సినిమా పితామహుడు మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు. 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియాలోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921లో రఘుపతి వెంకయ్య నాయుడు, తనకుమారుడు ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. పదేళ్ల తరువాత  అర్దేష్‌ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీలో  (అలం అరా), తెలుగులో  (భక్త ప్రహ్లాద), తమిళ్‌లో (కాళిదాస) మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథిహెచ్‌.ఎమ్‌.రెడ్డి. సురభి నాటక సమాజం వారి ప్రజాదరణ పొందిన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్‌ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో విడుదల్కెంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్‌ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదల్కెంది.

సినీ స్వర్ణ యుగంలో కొన్ని భారీ నిర్మాణ సంస్థలు

తెలుగు సినీ పరిశ్రమను 1932 నుండి 1982 వరకు స్వర్ణ యుగంగా చెప్పుకునేవారు. మూలా నారాయణస్వామి, బి.నాగిరెడ్డిలు 1948లో చెన్న్కె కేంద్రంగా విజయ వాహినీ స్టూడియోస్‌ స్థాపించి, విజయ వాహినీ, విజయ బ్యానర్‌లో ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. భక్తప్రహ్లాద (సినిమా)తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఎల్‌.వి.ప్రసాద్‌ కూడా చెన్న్కె కేంద్రంగా 1956లో ప్రసాద్‌ స్టూడియోస్‌ స్థాపించి, ప్రసాద్‌ ఆర్ట్స్‌  బ్యానర్‌లో హిందీ తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. అదే విధంగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ రావులు కలసి ఎన్‌ఏటి బ్యానర్‌పై ఎన్నో పౌరాణికాలు, అన్నపూర్ణ వారి బ్యానర్‌పై  దుక్కిపాటి మధుసూదన రావు, జగపతి ఆర్ట్స్‌ పతాకంపై విబి రాజేంద్రప్రసాద్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో డి రామానాయుడు, పద్మాలయ బ్యానర్‌లో జి  హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావులు, అన్నపూర్ణ స్టూడియోస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో సి అశ్వనీదత్‌, సిహెచ్‌ రామోజీరావు ఉషా కిరణ్‌ బ్యానర్‌లో... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అగ్ర నిర్మాణ సంస్థలు తెలుగు కళామతల్లికి ఆభరణాల్కె ఆకట్టుకున్నాయి. గతంలో ఏ నిర్మాణ సంస్థలో అయినా ఒక చిత్రం పూర్తి చేసి విడుదల చేయాలంటే సంవత్సరాలు గడిచేయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ కూడా ప్రకటించే విధంగా ప్లాన్‌ చేసుకుంటున్నారు నేటి నిర్మాతలు. ఈ విధమైన పక్క ప్లానింగ్‌తో  ఏడు సంవత్సరాల వయసు గల మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ మొదటి స్థానంలో వుందంటే అతిశయోక్తి కాదు. 

సినీ వజ్ర యుగంలో మైత్రి మూవీ మేకర్స్‌

తెలుగు సినీ పరిశ్రమ పుట్టిననాటి నుండి అగ్ర నిర్మాణ సంస్థలలో మూవీస్‌ సొంత స్టూడియోస్‌ వున్నా లేకున్నా బ్యాక్‌ అండ్‌ బ్యాక్‌ నిర్మించేవారు. ఒకే సారి రెండు చిత్రాలను ప్రారంభించడం విడుదల చేయడం సినీ చరిత్రలో నమోదు కాలేదు. అలాంటిది తెలుగు సినీ పరిశ్రమ నిర్మాణ విభాగం లో సరికొత్త సంచలనంగా మైత్రి మూవీ మేకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్భవించింది. ఎన్‌ఆర్‌ఐ  నవీన్‌ యేర్నేని, వై. రవి శంకర్‌ మరో పార్టనర్‌తో కలిసి  2015లో ఏర్పాటైన ఈ సంస్థ మొదటి సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు, శృతి హాసన్‌తో శ్రీమంతుడు సినిమాను నిర్మించింది. 75 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన ఈ చిత్రం అగస్టు 7న  2015న ప్రపంచవ్యాప్తంగా 2500G  స్క్రీన్స్‌పై  విడుదలై బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా 200 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్‌ సొంతం చేసుకుంది. వారి రెండవ సినిమా 2016లో  కొరటాల శివ దర్శకత్వం రిపీట్‌ చేస్తూ.. ఎన్‌.టి.ఆర్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్య మేనన్‌ ప్రధాన పాత్రలో నటించిన జనతా గ్యారేజ్‌ 50G కోట్లతో నిర్మిస్తే ఈ చిత్రం కూడా 150 కోట్ల వరకు వసూల్‌ చేసింది. ఈ చిత్రం సెప్టెంబరు 1, 2016లో విడుదలైంది. ఆ తరువాత మూడో చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో రాంచరణ్‌ తేజ్‌, సమంత, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘రంగస్థలం’ 60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం సుమారు 220 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018న విడుదలైంది. ఈ విధంగా అగ్ర హీరోలతో హ్యాట్రిక్‌ సక్సెస్‌ సాధించి తెలుగు సినిమా వజ్ర యుగంలో నెంబర్‌ వన్‌ అగ్ర నిర్మాణ సంస్థగా ప్రసిద్ధికెక్కింది. 

 

2018 నుండి 2022 వరకు విడుదలైన 13 చిత్రాలు

2018లో నాగ చైతన్య-చందు మొండేటి  ‘సవ్యసాచి’, రవి తేజ-శ్రీను వైట్ల  ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’, 2019లో సాయి ధరమ్‌ తేజ్‌ - కిశోర్‌ తిరుమల ‘చిత్రలహరి’, విజయ్‌ దేవరకొండ - భరత్‌ కమ్మ ‘డియర్‌ కామ్రేడ్‌’, నాని - విక్రమ్‌ కుమార్‌ నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’, శ్రీ సింహ - రితేష్‌ రానా ‘మత్తు వదలరా’, ఈ ఆరు చిత్రాలు యావరేజ్‌ టాక్‌తో రన్‌ అయ్యాయి. ఆ  తర్వాత  2021లో నూతన నటి నటులు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాలతో నిర్మించిన ‘ఉప్పెన’  విడుదల అయిన బాక్స్‌ ఆఫీస్‌ రికార్డ్స్‌  బద్దలు కొట్టింది. ఇదే ఏడాది అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల హాట్ట్రిక్‌ కాంబినేషన్‌లో నిర్మించిన పాన్‌ ఇండియా మూవీ  ‘పుష్ప ది రైజ్‌’ అంతర్జాతీయంగా మైత్రి మూవీ మేకర్స్‌కి పేరు తెచ్చింది. ఇటీవల ఈ చిత్రం రష్యాలో కూడా ప్రదర్శించబడటం విశేషం. ఇక సమ్మర్‌ స్పెషల్‌గా మహేష్‌ బాబు - పరుశురామ్‌ కాంబినేషన్‌ లో ‘సర్కారు వారి పాట’ మరో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది మైత్రి మూవీ మేకర్స్‌. ఈ ఏడాది లోనే విడుదల అయినా మరో మూడు చిత్రాలు నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో ‘అంటే... సుందరానికి’, లావణ్య త్రిపాఠి - రితేష్‌ రానాల ‘హ్యాపీ బర్త్‌ డే’, సుధీర్‌ బాబు - మోహన్‌ కృష్ణ ఇంద్రగంటిల ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల అయ్యాయి.

తెలుగు సినిమా చరిత్రలో అపూర్వ ఘట్టం

భారీ నిర్మాణ సంస్థలు ఏవైనా సరే అగ్ర హీరోలతో సినిమా తీస్తే మహా అయితే రెండు చిత్రాలు రన్నింగ్‌ లో వుంటాయి. ఒక వేళ షూటింగ్‌ పూర్తి చేసుకున్నా నెలా రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని  ఒక దాని తరువాత మరొకటి విడుదల చేస్తారు. అలాంటిది మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో మెగా స్టార్‌ చిరంజీవి  ‘వాల్తేర్‌ వీరయ్య’  నందమూరి బాలకృష్ణ  ‘వీరసింహారెడ్డి’ విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ అల్లు అర్జున్‌ ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రస్తుతం ప్రొడక్షన్‌ లో వున్నా చిత్రాలు. ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ లో వున్నా ప్రాజెక్ట్స్‌ యంగ్‌ ట్కెగర్‌ యన్టీర్‌ - ప్రశాంత్‌ నీల్‌ %చీ ు R% 31, మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ - బుచ్చిబాబుల చిత్రం, జాతి రత్నాలు దర్శకుడు అభినవ్‌ రెడ్డి దండాతో పాటు మరో రెండు చిత్రాలు ప్లానింగ్‌ చేసుకుంటూ భారీ సినిమా ఫ్యాక్టరీ నెలకొల్పారు మైత్రి మూవీ మేకర్స్‌. అంతే కాకుండా వీటిలో ‘వాల్తేర్‌ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల తేదీలతో ముందుకు వస్తున్నాయి. ఇలా ముగ్గురు అగ్ర నటులతో ఒకే నిర్మాణ సంస్థ ద్వారా చిత్రాలను ప్రారంభించి, సంక్రాంతికి పోటా పోటీగా విడుదల చేయడం ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాలేదు. అలాంటిది తెలుగు సినీ పరిశ్రమ నిర్మాణ విభాగంలో సరికొత్త సంచలనంగా మైత్రి మూవీ మేకర్స్‌ రికార్డ్‌ సృష్టించింది.

రివార్డులే కాదు ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్‌ 

ఒక పక్క కమర్షియల్‌ హిట్స్‌ సాధిస్తూనే అవార్డుల పరంపర కొనసాగించింది మైత్రి మూవీస్‌  సంస్థ.  ఎన్టీఆర్‌ నటించిన కొరటాల శివ చిత్రం ‘జనతా గారేజ్‌’  2017లో ఉత్తమ చిత్రంగా ఐఫా అవార్డు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు, ఉత్తమ చిత్రంగా సైమాలో నామినేట్‌ అయ్యింది. రాంచరణ్‌, సుకుమార్‌ల ‘రంగస్థలం’ ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌, సైమా అవార్డులకు నామినేట్‌ అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్‌ 17, 2021న విడులైన అల్లు అర్జున్‌, సుకుమార్‌ల బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘పుష్ప’ చిత్రానికి వచ్చిన ప్రజాదరణ మాములుగా లేదు నెక్స్ట్‌ లెవెల్‌లో వుంది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప చిత్రానికి వచ్చిన గుర్తింపు ఏ భారతీయ చిత్రానికి రాలేదని చెప్పొచ్చు. ‘తగ్గేదేలే’ అంటూ ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం నికెలోడియన్‌ కిడ్స్‌ ఛాయస్‌ అవార్డు ఇండియాకి దక్షిణ భారత అభిమాన సినిమాగా అవార్డు సాధించింది. 2022 సెప్టెంబర్‌ 10-11న బెంగుళూరులో జరిగిన 10వ సైమా అవార్డుల ఉత్సవంలో పుష్ప చిత్రానికి 1.ఉత్తమ చిత్రం, 2.ఉత్తమ్‌ దర్శకుడు  సుకుమార్‌, 3.ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌, 4. ఉత్తమ సహాయ నటుడు జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, 5. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ,6. ఉత్తమ గీత రచయిత చంద్ర బోస్‌ (శ్రీ వల్లి సాంగ్‌) 7. ఉత్తమ ప్రొడక్షన్‌ డిజ్కెనింగ్‌ జ్యూరీ అవార్డు, యస్‌ రామ కృష్ణ, మోనికా, ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది పుష్ప. అదే విధంగా మైత్రి నుండి వచ్చిన ఉప్పెన చిత్రం కూడా 3 సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అవి ఉత్తమ తొలి చిత్ర నటుడు వైష్ణవ్‌ తేజ్‌, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన, ఉత్తమ తొలి చిత్ర నటి కృతీ శెట్టి, అవార్డులను సాధించారు.ఇంకా ఈ ఏడాది పూర్తి కాలేదు కాబట్టి  భవిష్యత్తులో ఇంకా ఎన్ని అవార్డులను సాధించనుందో చూడాలి మరి.

2023 సంక్రాంతిలో మైత్రికి పోటీగా మైత్రి మూవీస్‌

జనవరి 13, 2023న ‘వాల్తేర్‌ వీరయ్య’

వాల్తేర్‌ వీరయ్యగా చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్‌ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మైత్రి మూవీ  మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌ లను అందించారు. విడుదల తేదీ పోస్టర్‌లో చిరంజీవి వింటేజ్‌ మాస్‌ అవతార్‌లో లుంగీ, వైబ్రెంట్‌ షర్ట్‌, హెడ్‌ బ్యాండ్‌తో  కనిపించారు. చేతిలో బల్లెం లాంటి ఆయుధం పట్టుకొని వర్షంలో సముద్రంలో పడవ నడుపుతూ పవర్‌ ఫుల్‌గా కనిపించారు చిరంజీవి. ఈ పోస్టరే పూనకాలు తెప్పించేలా వుంది. ఫస్ట్‌ సింగల్‌ బాస్‌ పార్టీ.. పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మారడంతో సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్‌ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఊర్వశి రౌతేలా చిరంజీవి సరసన అలరించింది. ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్‌ హంగులతో కూడిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ట్కెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. భారీ స్థాయిలో  నిర్మిస్తున్న ఈ చిత్రానికి, జికె మోహన్‌ సహ నిర్మాత. ఆర్థర్‌ ఎ విల్సన్‌ కెమెరామెన్‌గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌. బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్‌, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి కూడా పని చేస్తున్నారు. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్‌ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్‌ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ డీవోపీ: ఆర్థర్‌ ఎ విల్సన్‌  ఎడిటర్‌: నిరంజన్‌ దేవరమానే సహ నిర్మాతలు: జీకే మోహన్‌, ప్రవీణ్‌ ఎం స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్‌ రైటింగ్‌: హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి మార్కెటింగ్‌: ఫస్ట్‌ షో పని చేస్తున్నారు.

జనవరి 12, 2023న ‘వీరసింహారెడ్డి’

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేనిల మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం మాస్‌లో భారీ అంచనాలని క్రియేట్‌ చేసింది. టైటిల్‌, ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌ సింగిల్‌ జై బాలయ్య యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందించారు మేకర్స్‌.  ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో బాలకృష్ణ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్‌ టెర్రిఫిక్‌గా వుంది. సంక్రాంతి అనేది బాలకృష్ణకు పాజిటివ్‌ సెంటిమెంట్‌. తెలుగు వారి పెద్ద పండుగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. పండుగ సెలవులు సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టడానికి అనుకూలంగా వుండబోతున్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, చంద్రిక రవి (స్పెషల్‌ నంబర్‌) ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్‌ రైటర్‌  సాయి మాధవ్‌ బుర్రా డ్కెలాగ్స్‌ అందించగా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజ్కెనర్‌ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్‌ మాస్టర్స్‌గా రామ్‌-లక్ష్మణ్‌ పని చేస్తున్నారు.

సినీ పరిశ్రమలోని అందరి సహకారంతోనే మా సంస్థ ఇంత ఎత్తుకు ఎదిగింది: నిర్మాత నవీన్‌ యెర్నేని

‘‘2014లో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. మహేష్‌ బాబు ‘శ్రీ మంతుడు’ సినిమాతో శ్రీకారం చుట్టాం. ఇక్కడ సినిమాకు డబ్బు పెట్టుబడి పెట్టటమే ప్రదానం కాదు. కొబ్బరి కాయ కొట్టిననాటినుండి సినిమా రిలీజ్‌ వరకు మాతో పాటు జర్నీ చేసే  హీరోల, దర్శకుల, టాప్‌ టెక్నిషన్స్‌ సహకారం లేనిదే మేము ముందుకు వెళ్లలేము. మా మొదటి సినిమా నుండి ప్రతీ హీరో, డైరెక్టర్స్‌, టెక్నిషియన్స్‌ మమ్మల్ని ప్రోత్సహించారు, ఎంతో సహకారం అందించారు. వారందరికీ పత్రికా ముఖంగా మా ధన్యవాదాలు’’  అన్నారు.

టాలీవుడ హీరోలందరితో మా సంస్థ ద్వారా చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నాం: నిర్మాత రవి శంకర్‌ యలమంచిలి

‘‘ఇప్పటి వరకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వంటి లెజెండరీ హీరోస్‌తో, పవన్‌ కళ్యాణ్‌ గారు,  మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ, నాని, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరపు వంటి స్టార్‌ హీరోలతో మా సంస్థలో చిత్రాలు నిర్మించాము. ఇకపై కూడా టాలీవుడ్‌ హీరోలందరితో మా సంస్థ ద్వారా చిత్రాలను తీయాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్‌లో సి.ఈ.ఓగా చేయడం గర్వపడ్తున్నాను: చిరంజీవి (చెర్రీ)

తెలుగు సినీ పరిశ్రమ పుట్టి 90 ఏళ్ళు అవుతుంది నాటి నుంచి నేటి వరకు చూస్తే ఎన్నో నిర్మాణ సంస్థలు తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వాటిలో ప్రజల మదిలో గుర్తుండిపోయిన సంస్థలు విజయ, వాహిని, ప్రసాద్‌ ఆర్ట్స్‌, ఎన్‌ఏటి, అన్నపూర్ణ, సురేష్‌ ప్రొడక్షన్స్‌, జగపతి, పద్మాలయా,  వైజయంతి, ఉషా కిరణ్‌, వంటి ఎన్నో సంస్థలు వున్నాయి. అతి తక్కువ కాలంలో మా మైత్రి మూవీ మేక ర్స్‌ తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టిలో ఆ సంస్థల స్థానాన్ని అందు కోవడంలో నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ యలమంచిలిల కృషి ఎంతో వుంది. ఇందులో బాధ్యతగల సి.ఈ.ఓగా వర్క్‌ చేయడం గర్వంగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :