Radha Spaces ASBL

దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మధ్యాహ్నం 1.19కి ముహూర్తం ఫిక్స్!

దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మధ్యాహ్నం 1.19కి ముహూర్తం ఫిక్స్!

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలనేది కేసీఆర్ లక్ష్యం. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి తన పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇందుకు తెలంగాణలో ఉంటే సరిపోదని.. దేశమంతా తిరగాలని కేసీఆర్ భావించారు. అందుకోసం జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది కాలంగా జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మరొక అడుగు ముందుకేస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా బీజేపీ మాటల తూటాలు పేల్చుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అస్తశస్త్రాలనూ ప్రయోగిస్తోంది. కాస్త కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదనేది బీజేపీ ఆలోచన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని బలపడాలనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ శ్రేణులను పెద్దఎత్తున ఇప్పటికే తన వైపు తిప్పుకుంది బీజేపీ. దీంతో టీఆర్ఎస్ పై బాణాలు ఎక్కుపెట్టింది. పైగా హూజూరాబాద్, దుబ్బాక లాంటి ఉపఎన్నికల్లో విజయం సాధించడం కూడా బీజేపీకి మరింత ప్లస్ అయింది. హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం దక్కించుకోవడంతో బీజేపీ మాంఛి దూకుడు మీదుంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీని లైట్ తీసుకుంటూ వచ్చారు కేసీఆర్. ఆయితే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీలో కూడా జోష్ పెరిగింది. ఇక బండి సంజయ్ కి అధ్యక్ష బాధ్యతలు వచ్చిన తర్వాత బీజేపీ దూకుడు మరింత పెరిగింది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బండి సంజయ్ ముందుంటున్నారు. బండి దూకుడు వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ వస్తోందనేది వాస్తవం. ఇదే ఉత్సాహంతో పని చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనేది బీజేపీ ఆలోచన. అందుకే కేంద్ర పెద్దలు సైతం ప్రతి నెలా తెలంగాణలో పర్యటిస్తూ హీట్ పెంచుతున్నారు.

బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే జాతీయ స్థాయిలో పోరాడడం ఒక్కటే మార్గమని డిసైడయ్యారు కేసీఆర్. అందుకే దేశవ్యాప్తంగా పలువురి బీజేపీయేతర పార్టీల నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. చివరకు జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజులుగా ఈ మాట వినిపిస్తున్నా.. ఇప్పుడు దానికి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు పార్టీ పేరు, జెండా అనౌన్స్ చేయనున్నారు కేసీఆర్. ఆదేరోజు టీఆర్ఎస్ఎస్పీ, కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలోనే కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇకపై ఎక్కువ సమయం జాతీయ రాజకీయాలకే సమయం కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :