అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ మరో చరిత్ర.. స్పేస్ వాక్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష యాత్రల్లో మరో చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది. పొలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా.. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లింది. వారిలో ఒకరైన జేర్డ్ ఇస్సాక్ మన్....క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు.ప్రొఫెషనల్స్ కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజినీర్ సారాగిల్లిస్ ఆయనను అనుసరించారు.
ఐఎస్ఎస్ కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. కాగా, నలుగురు వ్యోమగాముల బృందాన్ని హూస్టన్ కు చెందిన ఆక్సియోమ్ స్పేస్ ఐఎన్సీ సంస్థ ఐఎస్ఎస్ కు పంపింది. ఇందుకోసం స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను వినియోగించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లో నాసాకు చెందిన కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక నింగికి ఎగిసింది.
ఇందుకోసం 25 అంతస్తుల ఎత్తు ఉన్న భారీ వ్యోమనౌకను వినియోగించారు. దీన్ని రెండు దశల ఫాల్కన్ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దీని పైభాగాన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లో నలుగురు వ్యోమగాములు ఆసీనులయ్యారు. ఈ బృందానికి నాసా వ్యోమగామి మైకేల్ లోపెజ్ అలెగ్రియా నాయకత్వం వహిస్తున్నారు. రాకెట్ నుంచి విడిపోయిన అనంతరం స్వయం ఛోదిత క్రూ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి 400 కిమీ ఎత్తులో ఐఎస్ఎస్ కు అనుసంధానమవుతుంది.