అమెరికాకు భారత్ పరిచయం చేసింది : జో బైడెన్
అమెరికా అభివృద్ధిలో దక్షిణాసియా అమెరికన్లదే ప్రధాన పాత్ర అని అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు. దీపావళి ద్వారా సంప్రదాయాలను అమెరికాకు భారత్ పరిచయం చేసిందని గుర్తు చేశారు. దాదాపు కోటిమందికి పైగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు దీపావళి వేడుకల్లిన అమెరికాతో పాటు ప్రపంచమంతటా వేర్వేరు దేశాల్లో సంబరంగా జరుపుకొంటున్నారని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిలిచే దీపావళిని తరతరాలుగా దక్షిణాసియా వాసులు అమెరికా సమాజంలోకి తీసుకొచ్చారని బైడెన్ ప్రశంసించారు. సంక్లిష్ట సమయాల్ని అధిగమించి, దేశం బలపడటానికి దీపావళి సందేశం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.
Tags :