దీనిపై సీబీఐ విచారణ.. లేదంటే హైకోర్టుకు : సోమిరెడ్డి
సిలికా అక్రమ తవ్వకాలపై తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై 15 రోజుల్లో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దోచుకొని దాచుకున్న వారిని వదిలిపెట్టేది లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
Tags :