తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి

తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా జగిత్యాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డాక్టర్ బి.ఎం.వినోద్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని నరేష్ రెడ్డి అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మన్నెగూడెం సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. గతంలో 11 ఏళ్ళపాటు అరేబియన్` అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో నరేష్ రెడ్డి పని చేశారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేస్తున్నారని తెలిపారు. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు.






