Radha Spaces ASBL

ప్రముఖ గాయని వాణీ జయరామ్ ఇకలేరు

ప్రముఖ గాయని వాణీ జయరామ్ ఇకలేరు

ప్రముఖ గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఆసుపత్రిలో మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీజయరాం భారతదేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు.

అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :