ఆది సాయి కుమార్ టాప్ గేర్ నుంచి సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్

ఆది సాయి కుమార్ టాప్ గేర్ నుంచి సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి K శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. రెడ్ FM ఆఫీసులో ఆది సాయి కుమార్ సహా చిత్ర యూనిట్ అంతా కలిసి ఈ సాంగ్ విడుదల చేశారు.

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను నేడు (నవంబర్ 25) సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ పాటలో సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా సాగుతూనే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సాంగ్ లోని సన్నివేశాలు, మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి అప్డేట్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసి సినిమాపై హైప్ పెంచేయగా..

తాజాగా విడుదల చేసిన ఈ వెన్నెల వెన్నెల సాంగ్ ఆసక్తి నెలకొల్పింది. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది.

 

 

Tags :