ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మళ్లీ స్పీడ్ పెంచిన షర్మిల..!

మళ్లీ స్పీడ్ పెంచిన షర్మిల..!

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న షర్మిల కరోనాతో కాస్త వెనక్కు తగ్గారు. అంతకుముందు ఆత్మీయ సమావేశాలతో సందడి చేశారు. ఖమ్మంలో బహిరంగసభ ద్వారా పార్టీ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశారు. పార్టీ విధివిధానాలు ఖరారవుతున్నాయని.. జూన్ లో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నిరుద్యోగ దీక్ష చేశారు. దీని ద్వారా తాము అనుకున్నంత మైలేజ్ సాధించామని షర్మిల భావించారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో కాస్త నెమ్మదించారు.

కొన్ని రోజుల పాటు మెయిన్ స్ట్రీమ్ కు దూరంగా ఉంటూ లోటస్ పాండ్ కే పరిమితమైన వై.యస్. షర్మిల మరోసారి రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కరోనా కష్ట కాలంలో అభిమానులకు అండగా ఉండాల్సిన షర్మిల.. చడీచప్పుడు లేకుండా ఉండిపోయారు. ఇంటాబయటా ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మళ్ళీ నేనున్నా అంటూ వై.యస్ అభిమానులకు భరోసా ఇస్తూ సహాయ కార్యక్రమాలకు శ్రీ కారం చుట్టారు.

షర్మిలకు కరోనా సెకండ్ వేవ్ అనుకొని షాక్ ఇచ్చింది. వై.ఎస్. అభిమానులందరినీ వరుస మీటింగ్స్ పెట్టి ఇక పొలిటికల్ ఎంట్రీయే తరువాయిలా ముందుకెళ్లారు. సంకల్ప సభతో పొలిటికల్ ఎంట్రీపై పుల్ క్లారిటి ఇచ్చారు. ఆ తరువాత ఉద్యోగ దీక్షతో ఇందిరాపార్కు వద్ద జరిగిన అంశంతో అనుకున్నది సాధించామని భావించారు. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ తో ఇంటికే పరిమితం అయ్యారు. సంకల్ప సభ, ఉద్యోగ దీక్షతో చాలా మంది అమె అభిమానులు కరోనా బారిన పడ్డారు. షర్మిలకు అత్యంత దగ్గరగా ఉండే వారు కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.

తెలంగాణలోని వై.యస్ అభిమానులను కంటికి రెప్పలా చూసుకుంటానని.. వారే నాకు దిక్సూచి అని షర్మిల ప్రకటించారు. అయితే అభిమానులే కాకుండా .. తెలంగాణలో చాలా మంది కరోన బారిన పడి ఇబ్బందులుపడుతున్నారు. కొన్ని పార్టీల కార్యకర్తలను కాపాడుకునేందుకు అధిష్టానం ఎంతోకొంత ప్రయత్నం చేస్తోంది. కానీ కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న షర్మిల.. అభిమానులనుప పట్టించుకోకుండా లోటస్ పాండ్ కే పరిమితం అయ్యారనే విమర్శలు వచ్చాయి.

దీంతో... ఇంతకాలం సైలెంట్ గా ఉన్న షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. అభిమానులను ఆదుకునేందుకు ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. షర్మిల వారికి ఆర్థిక సహయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక.. ఇన్నాళ్లూ ప్రెస్ నోట్లకే పరిమితమైన షర్మిల.. ఇప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ నేరుగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇన్నాళ్లు కరోనా వల్ల కరోనా వల్ల ఇంటికే పరిమితమైన షర్మిల.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అభిమానులకు, ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నారు. వారి కష్ట సుఖాలు తెలుసుకుని అండగా నిలవాలనుకుంటున్నారు. అందుకే వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతేకాక.. అభిమానులకు తాను అండుగా ఉంటానని హామీ ఇచ్చారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :