శంకర్ వల్లే గేమ్ ఛేంజర్ రిలీజ్‌లో కన్ఫ్యూజ్

ఒక డైరెక్టర్ ఎట్ ఏ టైమ్ రెండు సినిమాలను, ఇద్దరు పెద్ద స్టార్లతో, అది కూవా రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది వస్తుందో డైరెక్టర్ శంకర్ విషయంలో చాలా క్లియర్ గా తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటుగా, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని కూడా చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ రెండింటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది.
అయితే ఫ్యాన్స్ ఇవాళ అప్డేట్ కోసం ఎదురుచూసింది రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుందనే దానికోసమే. ప్రాజెక్ట్ కె తో ప్రభాస్, మహేష్28తో మహేష్ 2024 సంక్రాంతికి బెర్త్ లు కన్ఫార్మ్ చేసుకున్నారు. రామ్ చరణ్ కూడా ఈ రేసులోకి వస్తే మంచి పోటీ చూడొచ్చని అందరూ ఆశ పడ్డారు. కానీ ఇవాళ అనౌన్స్‌మెంట్ లో అసలు అందరూ ఎదురుచూసిన అనౌన్స్‌మెంట్‌ను అదే రిలీజ్ డేట్ ను దాచేశారు. దానికి రీజన్ శంకరే అని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్2 ఆఖరి దశలో ఉంది. దీపావళికి ఎలాగైనా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఇండియన్2 ఆలస్యమయ్యేలా ఉంది. దానికి తోడు విజయ్ లియో ఆల్రెడీ బరిలో ఉంది కాబట్టి ఆ సినిమాతో పోటీ పడి థియేటర్ల కోసం కొట్టుకునే ఆలోచనలో శంకర్ కనిపించట్లేదు.కాబట్టి ఇండియన్2 ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని శంకర్ ఆలోచిస్తున్నాడట. అదే జరిగితే శంకర్ తన రెండు సినిమాలని ఒకేసారి రిలీజ్ చేసి రిస్క్ లో పెట్టడానికి ఒప్పుకోడు. అందుకే గేమ్ ఛేంజర్ డేట్ తేలాలంటే ముందు ఇండియన్2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సిందే.