Radha Spaces ASBL

గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?

గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?

భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులపై దాడికి ముష్కరులు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు 9 పేజీల ఇంటెలిజెన్స్‌ నివేదిక కేంద్ర హోంశాఖకు చేరినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌, ఆఫ్గన్‌-పాక్‌ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్టు ఐబీ వెల్లడిరచింది.

డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించినట్టు తెలిసింది. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌, జైషే మహ్మద్‌, హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి టెర్రర్‌ సంస్థలు ఈ ఉగ్ర ప్రణాళిక వెనుక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్‌ చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.  ప్రధాని సభపై ఈ ఉగ్రముఠా దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :