అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు నివాసంలో రహస్య పత్రాలు

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నివాసంలో గతవారం రహస్య పత్రాలు బయటపడినట్టు ఆయన ఆటార్నీ గ్రెగ్ జాకబ్ తెలిపారు. ఈ పత్రాలను అనుకోకుండా ఆయన వ్యక్తిగత నివాసానికి తరలించాలని, వీటి గురించి ఆయనకు తెలియదని నేషనల్ ఆర్కైవ్స్ విభాగానికి వెల్లడిరచారు. విచారణకు సహకరించేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడైన్ నివాసాల్లోనూ రహస్య పత్రాలు బయటపడటం వారిని చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
Tags :