సరిపోదా శనివారం రన్ టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నెలాఖరున రిలీజ్ కానున్న సరిపోదా శనివారం కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్‌టైమ్ కు సంబంధించిన వివరాల గురించి ప్రస్తుతం నెట్టింట ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు రన్ టైమ్ ఇప్పటికే లాక్ అయినట్లు తెలుస్తోంది. సినిమా నిడివి 155 నిమిషాలు వచ్చినట్లు సమాచారం. అంటే 2 గంటల 35 నిమిషాల నిడివితో సరిపోదా శనివారం థియేటర్లలోకి రానుంది. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఈ రన్ టైమ్ చాలా డీసెంట్ అనే చెప్పాలి. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో జనాలను చివర వరకు సీట్ లో కూర్చోపెట్టడానికి మేకర్స్ ఈ రన్ టైమ్ ను సెలెక్ట్ చేసుకోవడమే కరెక్ట్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ మధ్య రిలీజవుతున్న ప్రతీ సినిమా 3 గంటల రన్ టైమ్ తోనే వస్తున్నాయి. యానిమల్ సినిమా అయితే ఏకంగా మూడున్నర గంటలుంది. సలార్, కల్కి సినిమాలు కూడా మూడు గంటల రన్ టైమ్ తో వచ్చినవే. అంతెందుకు నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో గతంలో వచ్చిన అంటే సుందరానికీ కూడా మూడు గంటల సినిమానే. అప్పట్లో ఈ సినిమాకు రన్ టైమ్ మైనస్ అని కూడా అన్నారు. అందుకే వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సరిపోదా టీమ్ ఈ సినిమాకు రెండున్నర గంటల నిడివిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.