అంగరంగ వైభవంగా ‘సంతోషం’ ఓటీటీ అవార్డ్స్
తెలుగునాట సినీ వార పత్రికల్లో ‘సంతోషం’ రూటే సెపరేట్.. ఓ సాధారణ జర్నలిస్ట్ స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన సురేష్ కొండేటి అంచెలంచెలుగా ఎదిగి ‘సంతోషం’ పేరుతో సినిమా పత్రికను స్థాపించి సంచలనం సృష్టించారు. 2002లో సినీ అతిరథుల సమక్షంలో ప్రారంభమైన ‘సంతోషం’ దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ నేటికీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకు పోతోంది. తనను ఇంతటి స్థాయికి చేర్చిన సినీ పరిశ్రమ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ‘సంతోషం’ సినీ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టారు సురేష్ కొండేటి.
గత 21 సంవత్సరాలుగా అప్రతిహతంగా ఈ వేడుక కొనసాగుతూనే ఉంది. తాజాగా 22వ సంతోషం అవార్డ్సు వేడుకను డిసెంబర్ 2వ తేదీన గోవాలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు సురేష్ కొండేటి. అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ‘సంతోషం`ఓటీటీ’ అవార్డ్స్ పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు సురేష్ కొండేటి. ప్రపంచ సినీ చరిత్రలో ఇదో తొలి అడుగు అని చెప్పాలి. తాజాగా సంతోషం`ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సర వేడుకల్ని శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్, జయసుధ, సంచలన రచయితలు విజయేంద్రప్రసాద్, సత్యానంద్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.యస్. రామారావు, జేడీ చక్రవర్తి, వేణు, నిరుపమ్, ఓంకార్, సుహాస్, అనసూయ, హంసానందిని, డిరపుల్ హయత్, జోష్ రవి, దర్శకులు వశిష్ట, సాయిరాజేష్, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాధామోహన్, వాసు, ఎస్‌కెఎన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి. ప్రన్నకుమార్, లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేకే గ్రూప్ (క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్), అక్షర గ్రూప్ అధినేతలు కోట కుమార్, రాజేష్‌లు మాట్లాడుతూ...
సంతోషం అవార్డ్స్‌ను ఇంత ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తున్న సురేష్ కొండేటి గారికి అభినందనలు. ఈ అవార్డ్స్‌ను పొందిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు కంగ్రాట్స్ చెపుతున్నాం. మమ్మల్ని ఈ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో అసోసియేట్ చేసిన సురేష్ గారికి ధన్యవాదాలు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. కానీ సురేష్ గారు మాత్రం ఎప్పుడూ కొత్తకొత్త థాట్స్‌తో రాకెట్‌లాగా ముందుకు దూసుకు పోతూనే భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ‘సంతోషం’తో మా జర్నీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...
ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సంతోషం పత్రికకు, సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. అలాగే ‘నిశానీ’ టీం అందరికీ నా కృతజ్ఞతలు.
జయసుధ మాట్లాడుతూ...
సంతోషం ఓటీటీ అవార్డ్ విన్నర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్. ఓటీటీ అనే ఓ మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది మనకు. సురేష్ కొండేటి గారు ఇలాంటి మరెన్నో వేడుకలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఓటీటీ వల్ల అనేక మంది అమేజింగ్ యాక్టర్స్ మన ముందుకు వస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. కొందరి నుంచి మేం ఇంకా నేర్చుకోవాలేమో అనిపించేంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్‌లు ఉన్నారు అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ...
జయసుధ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరటానికి కారణమైన నాకు నేనే పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ స్కూల్‌కు వెళుతుంటే నేను స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాను. అందరూ ట్యూషన్‌కు వెళుతుంటే నేను ట్యూషన్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాను. సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను. ‘దయ’ వెబ్ సిరీస్‌కుగాను నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ కొండేటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దయ టీం అందరికీ, హాట్‌స్టార్ వారికి థ్యాంక్స్.
నటి అనసూయ మాట్లాడుతూ...
నన్ను ఈ అవార్డ్స్‌కు ఎంపిక చేసినందుకు సంతోషం సురేష్ కొండేటి గారికి థన్యవాదాలు. జయసుధ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అందుకోవటం మరింత సంతోషంగా ఉంది. ఈ అవార్డ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ‘ప్రేమ విమానం’లో నా పాత్ర నాకు బాగా నచ్చి చేసింది. నాతో పాటు ఈ ఓటీటీ అవార్డ్స్ అందుకుంటున్న అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
మహా న్యూస్, మహా మ్యాక్స్ అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ...
ఓటీటీ సినిమాలకు అవార్డులు ఇవ్వాలనే సంకల్పాన్ని ఏర్పరచుకున్న సంతోషం పత్రిక, సురేష్ కొండేటి గార్లకు నా హృదయ పూర్వక అభినందనలు. నిజం చెప్పాలంటే ఇలాంటి భారీ వేడుకలను ప్రభుత్వం గానీ, చిత్ర పరిశ్రమ గానీ నిర్వహించాలి. కానీ ఓ సాధారణ జర్నలిస్ట్ సురేష్ కొండేటి 22 సంవత్సరాలుగా కంటిన్యూగా సంతోషం సినీ అవార్డ్స్‌ను, రెండు సంవత్సరాలుగా సంతోషం ఓటీటీ అవార్డ్స్‌ను భారీ ఎత్తున ఇవ్వడం అంటే మాటలు కాదు. అందరం గర్వంగా ఫీలవ్వాల్సిన అంశం. మా మహా న్యూస్, మహా మ్యాక్స్‌ల ద్వారా సురేష్ కొండేటి గారికి సపోర్ట్‌గా నిలవటం ద్వారా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌లోని కళను, నైపుణ్యాన్ని మరింతగా వెలికి తీయాలనేది మా ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో కూడా మా మహా మ్యాక్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయి. అలాగే మురళీ మోహన్ గారు ఇటీవల మా మహా మ్యాక్స్ ఛానల్ ప్రారంభం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ స్థాయి ఉత్తమ నటుడి అవార్డ్‌ను అందుకున్న తొలి నటుడు అల్లు అర్జున్‌కు అటు పరిశ్రమ గానీ, ఇటు ప్రభుత్వం గానీ సన్మానం చేయక పోవడం బాధాకరం అన్నారు. సంతోషం గానీ, మరో ఇతర సంస్థ గానీ ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మా వంతు ప్రయత్నం కూడా మేం తప్పకుండా చేస్తాం. ఈరోజు ప్రస్తుత తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారిని నేను వెంటపెట్టుకుని వచ్చాను. ఎందుకంటే అమెరికాలో ఇలాంటి అవార్డ్ కార్యక్రమాలు ఎవరైనా చేయాలనుకుంటే వారి సహకారం ఉండాలని మీ అందరి తరపున విజ్ఞప్తి చేయాలని కోరుతున్నా అన్నారు.
తాజా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ...
సంతోషం ఓటీటీ అవార్డ్ విన్నర్స్ అందరికీ నా తరపున, తానా తరపున కంగ్రాట్స్ చెపుతున్నాను. మేం అమెరికాలో ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించినా మన సినిమా వారు ఉంటేనే దానికి నిండుదనం, సక్సెస్ వస్తాయి. భవిష్యత్తులో అమెరికాలో నిర్వహించే కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తాం. ఈ సంతోషం ఓటీటీ అవార్డ్స్‌ను నిర్వహిస్తున్న సురేష్ కొండేటి గారికి అభినందనలు అన్నారు.
నిర్మాత మండలి అధ్యక్షులు దాము మాట్లాడుతూ...
ఇన్ని సంవత్సరాలుగా సినిమా అవార్డ్స్, రెండు సంవత్సరాలుగా ఓటీటీ అవార్డ్స్ అందిస్తున్న సంతోషం సురేష్‌కు నా హృదయ పూర్వక అభినందనలు అన్నారు.
బుల్లితెర సంచలనం, దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ...
నన్ను ఈ అవార్డ్‌తో ప్రోత్సహించిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. 21 సంత్సరాలుగా సినీ అవార్డ్స్ ఇవ్వడం ఆయన ప్యాషన్ ఏంటో చెపుతోంది. నాకు ఈ అవార్డ్ రావటానికి కారణమైన డిస్నీ హాట్‌స్టార్ వారికి, మా యూనిట్ అందరికీ థ్యాంక్స్.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ...
ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన భారీ సినీ అవార్డ్ వేడుకలను సురేష్ కొండేటి ఒక్కడే నిర్వహించడం రియల్లీ గ్రేట్. 22వ సంతోషం సినీ అవార్డ్స్ డిసెంబర్ 2న గోవాలో జరగబోతున్నాయి. గోవాలోనే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కూడా జరగబోతోంది. సంతోషం అవార్డ్స్ వేడుకను చూసి, అంతకన్నా బాగా మనం ఫిలిఫెస్టివల్ వేడుకను చేయాలనే పట్టుదల గోవా ప్రభుత్వంలో వచ్చేలా 22వ సంతోషం అవార్డ్స్ జరుగుతాయని భావిస్తున్నాను. ఈ ఓటీటీ అవార్డులను కూడా భవిష్యత్తులో మరింత ప్రతిష్ఠాత్మకంగా సంతోషం నిర్వహించాలని కోరుకుంటూ ఓటీటీ అవార్డు విన్నర్స్ అందరికీ నా కంగ్రాట్స్ అన్నారు.
నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ...
సురేష్‌తో నాది 10 సంవత్సరాల అనుబంధం. సురేష్ ఏ పని చేపట్టినా దాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగానే ఉంటాడు. మంచి హార్డ్ వర్కర్. చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి చేరటం గ్రేట్. మొన్న సంతోషం సినీ అవార్డ్స్ అన్నాడు. ఈరోజు సంతోషం ఓటీటీ అవార్డ్స్ అన్నాడు. రేపు ఏ అవార్డ్స్ అంటాడో తెలీదు. బట్ ఏది చేసినా తప్పకుండా సక్సెస్ చేసే సత్తా అతనిలో ఉంది. నిర్మాతలకు, దర్శకులకు చక్కని ప్లాట్‌ఫామ్‌గా మారిన ఓటీటీని ప్రోత్సహించటానికి ఈ అవార్డులను ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ ఓటీటీ అవార్డ్సు సాధించిన అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
సన్‌టెక్స్ సోలార్ ప్రొడక్ట్స్ అధినేత సురేష్ మాట్లాడుతూ...
సంతోషం ఓటీటీ అవార్డ్స్‌తో మేం అసోసియేట్ అవ్వడం ఇది రెండోసారి. డిసెంబర్ 2న గోవాలో జరిగే ఈవెంట్‌ను కూడా స్పాన్సర్ చేస్తున్నాం. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులకు, అవార్డ్ విన్నర్‌లకు మా సంస్థ తరపున అభినందనలు అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ...
సంతోషం సురేష్ గారు జర్నలిస్ట్‌గా, పబ్లిషర్‌గా, యాంకర్‌గా, నటుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏదైనా స్టార్ట్ చేయడం ఈజీనే. కానీ దాన్ని 22 సంవత్సరాలుగా కొనసాగించడం అంత ఆషామాషీ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలే అవార్డు ఫంక్షన్ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితిలో సురేష్ ధైర్యానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలతో పాటు ఓటీటీకి అవార్డ్స్ ఇవ్వడం ఇండియాలోనే మొట్టమొదటిది అనుకుంటా. అలాగే గోవాలో జరగబోయే అవార్డ్ ఫంక్షన్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఓటీటీ అవార్డ్‌లు గెలుచుకున్న అందరికీ అభినందనలు అన్నారు.
దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ...
22 సంవత్సరాలుగా సురేష్ కొండేటి గారు సినీ అవార్డ్ ఫంక్షన్ నిర్వహించడం మాటలు కాదు. ఇప్పుడు ఓటీటీ అవార్డ్స్ కూడా ఇవ్వడం గ్రేట్. నేను ‘కలర్ ఫొటో’ చిత్రం తీసినప్పుడు దానికి అవార్డ్స్ వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ అది ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నేషనల్ అవార్డు వచ్చిందనుకోండి. ఓటీటీని ప్రోత్సహించటానికి సురేష్‌గారు ప్రవేశపెట్టిన ఈ అవార్డ్స్ నిరంతరాయంగా జరగాలని కోరుకుంటూ విజేతలందరికీ నా అభినందనలు అన్నారు.
అరుణశ్రీ ఎంటర్‌టైనర్స్ అధినేత తిరుపతిరెడ్డి మాట్లాడుతూ...
సురేష్‌గారి మంచి సంకల్పంతో చేపట్టిన అవార్డుల వేడుక 22 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉండడం నిజంగా అభినందనీయం. కళాకారుల్ని ప్రోత్సహించటానికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉంది. సురేష్ గారి నిరంతర కృషి, పట్టుదలకు హేట్సాఫ్ అన్నారు.
సంపంగి సంస్థ ప్రతినిధి మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ...
ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. గోవా అవార్డ్స్‌లో కూడా మేము స్పాన్సర్స్‌గా ఉన్నాం. తప్పకుండా అది కూడా సక్సెస్ అవుతుంది. సంతోషం అవార్డ్ అంటేనే చాలా మందికి ఓ గోల్ ఉంటుంది. ఈ ఓటీటీ అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
ముఖ్య అతిథి మురళీ మోహన్ మాట్లాడుతూ...
స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవార్డ్స్ విషయంలో రెండు ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు అన్నట్లు ఉంటున్నాయి. ఒకప్పుడు నంది అవార్డ్స్ పేరుతో రెగ్యులర్‌గా ఇచ్చేవారు. అది మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డ్స్ ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన జరిగినందున ఆంధ్రప్రదేశ్ ‘నంది’ అవార్డ్స్ పేరుతో ఇస్తోంది కనుక, తెలంగాణ ప్రభుత్వం మరో పేరే ఏదైనా పెట్టి అయినా అవార్డు ఇవ్వాలి. ఈ అవార్డుల వల్ల లక్షలు, కోట్లు వస్తాయని కాదు. ఒక ప్రభుత్వం కళాకారుల్ని, టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసి అవార్డు ఇస్తే కళాకారులు పొంగిపోతారు. దాన్ని అందరికీ చూపించుకోవటం ఎంత గర్వంగా ఉంటుంది. మీరు ఇచ్చే షీల్డ్‌లే కావాలంటే మేం డబ్బులు పెట్టి బజారులో కొనుక్కోవచ్చు. అదికాదు మాకు కావాల్సింది. ప్రభుత్వాలు మా టాలెంట్‌ను గుర్తించాలి. ఎన్నోసార్లు రెండు ప్రభుత్వాలకు చెప్పాం. కానీ పట్టించుకోలేదు. దీనికి లక్షలు, కోట్లు ఖర్చు ఏమీ అవ్వవు.
మన తెలుగు హీరో అల్లు అర్జున్‌కు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది. కానీ అటు తెలుగు ప్రభుత్వాలు కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ కానీ ఆయన్ను సత్కరించుకోలేక పోయాం. ఇది నిజంగా బాధాకరం. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే, జాతీయ అవార్డులు కూడా అనేకం వస్తే కనీసం ప్రభుత్వం పిలిచి అభినందించలేదు. అలాగే పరిశ్రమ కూడా వారిని సత్కరించ లేదు. ఇలాంటి పరిస్థితి కళారంగానికి మంచిది కాదు. ఈ కార్యక్రమం కూడా సురేష్ కొండేటి నిర్వహించాలని నా కోరిక. సురేష్ కొండేటి లాంటి చిన్న జర్నలిస్ట్ 22 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వడం ఎంత గొప్ప విషయం. గతంలో సినీ హెరాల్డ్, సితార, ఆంధ్రజ్యోతి ఇలా కొన్ని సంస్థలు అవార్డులు ఇచ్చారు కానీ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వలేదు. ఈ విషయంలో సురేష్ కొండేటి గ్రేట్. సినీ పరిశ్రమ తరపున సురేష్ కొండేటికి రుణపడి ఉన్నాం. అన్ని క్రాఫ్ట్స్‌లోని వారిని వెతికి మరీ అవార్డ్స్ ఇస్తుండడం సురేష్ గొప్పతనాన్ని చెపుతోంది.
ఓటీటీ ద్వారా గొప్ప నటీనటులు, టెక్నీషియన్‌లు మనకు పరిచయం అవుతున్నారు. మేం 10 సినిమాలు చేస్తే గానీ ట్రాక్‌లో పడలేదు. మీరు మాత్రం 1,2 సినిమాలకే అద్భుతాలు చేస్తున్నారు హేట్సాఫ్. కానీ ఓటీటీ సినిమాలకు సెన్సార్ లేదు కదా అని ఏది పడితే అది తీయకండి. మీరు సెన్సార్ ఉన్నట్లుగానే భావించి సెల్ఫ్ సెన్సార్ చేసుకోండి. ఎందుకంటే మనకు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఫాలో అయి, గౌరవించినప్పుడే మన మనుగడకు అర్ధం ఉంటుంది. మనతో పాటు మన ఇంట్లో ఆడవారు, పిల్లలు కూడా ఓటీటీలో వచ్చే సినిమాలను మన పక్కనే కూర్చుని చూస్తున్నారు. సిగరెట్లు తాగే సన్నివేశాలు, మందు తాగే సన్నివేశాలు, ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి మందు తాగే సన్నివేశాలు ఇలా చూపించుకుంటూ పోతే ఎలా. దయచేసి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవారు. ఆ తర్వాత టీవీలకు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఈ రెండిరటికీ మూలమైన నాటకాలకు ఇచ్చేవారు కాదు. మేము చాలా సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాటకాలను కూడా నంది అవార్డుల్లోకి చేర్చారు. అప్పటి నుంచి ‘ఆంధ్రప్రదేశ్ సినిమా, టీవీ, థియేటర్ ఆర్ట్స్ నంది అవార్డ్స్’ అని మార్చారు. సురేష్ కొండేటి ఫంక్షన్ చేస్తే అద్భుతంగా చేస్తాడు అనే పేరుంది. అందుకే స్పాన్సర్స్ కూడా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ అంటే అసోసియేట్ అవ్వడానికి ఇంట్రస్ట్‌గా ఉంటారు. ఆల్ ది బెస్ట్ సురేష్ కొండేటి అన్నారు.
నిరుపమ్ మాట్లాడుతూ...
నాకు ఈ అవార్డును ఇచ్చిన సంతోషం సురేష్ గారికి థ్యాంక్స్. మురళీ మోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం మరింత హ్యాపీ. మా ‘కుమారి శ్రీమతి’ నిర్మాత స్వప్నదత్ గారికి, యూనిట్‌కు థ్యాంక్స్ అన్నారు.
హంసానందిని మాట్లాడుతూ...
సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా సురేష్‌గారు అవార్డులు ఇస్తుండటం రియల్లీ గ్రేట్. విన్నర్స్ అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అన్నారు.
ఆలివ్ మిఠాయి దొరైరాజు మాట్లాడుతూ...
ఇంతటి అద్భుతమైన అవార్డు వేడుకల్లో మమ్మల్ని భాగస్వాములను చేసిన సురేష్ గారికి ధన్యవాదాలు. ఓటీటీలకు అవార్డులు ఇవ్వడం అనేది ఆయనతో మొదలవ్వటం ఆనందంగా ఉంది. అవార్డు విన్నర్స్ అందరినీ అభినందనలు అన్నారు.
స్మార్ట్ యాడ్స్ స్క్రీన్స్ సంస్థ అధినేత గిరి మాట్లాడుతూ....
ఎక్కడో పాలకొల్లు అనే చిన్న ఊరులోపుట్టిన సురేష్ కొండేటి గారు ఇవాళ ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు గుర్తు పట్టే స్థాయికి చేరటానికి పడ్డ కష్టం హేట్సాఫ్. ఆయన హార్డ్‌వర్కే ఈ స్థాయికి చేర్చింది. సంతోషం అవార్డు వేడుకల్లో స్పాన్సర్స్‌గా మాకు అవకాశం కల్పించిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. ఈ ఓటీటీ అవార్డు విన్నర్స్‌కు కూడా అభినందనలు అన్నారు.
దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ...
నేను తీసిన ‘పలాస’ కోవిడ్ ఇబ్బందుల వల్ల 12 రోజులకు థియేటర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రపంచం అంతా చూసి నాకు ఊపిరి ఇచ్చింది. ప్రస్తుతం నా చేతిలో కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయంటే కారణం ఓటీటీలో నా పలాస విడుదలై నాకు లైఫ్ ఇవ్వడమే. ఇలాంటి ఫంక్షన్స్ చేయడం వల్ల ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ కుటుంబంతో సహా తరలివచ్చి ఆత్మీయతను పంచుకుంటాం. సురేష్ కొండేటిగారు ఇలా ఓటీటీ అవార్డ్స్ ఇవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు.
హీరో వేణు మాట్లాడుతూ...
డిస్నీ హాట్‌స్టార్‌లో నేను ‘అతిథి’ చేశాను. ఇదే నా తొలి ఓటీటీ ఫిల్మ్. ‘అతిథి’ ప్రెస్‌మీట్ అప్పుడు నన్ను వెబ్ సిరీస్‌ల్లో అశ్లీలత, బూతులు, వల్గారిటీ ఉంటున్నాయి కదా అని అడిగారు. నేను అప్పుడే చెప్పాను మనం సొసైటీలో ఉంటున్నాం. ఇంట్లో అందరితో కలిసి చూసే వెబ్ సిరీస్‌లు వేళ్లమీద లెక్కపెట్ట వచ్చు. ఇది చాలా బాధాకరం. ఇంట్లో ఎవరికి వారు సెపరేట్‌గా వాళ్ల రూముల్లో కూర్చుని చూసే దుస్థితి వచ్చింది. ఇంత వల్గారిటీ, బూతులు లేకుండా సినిమాలు థియేటర్స్‌లో బాగానే ఆడుతున్నాయి కదా. సో.. కంటెంట్ ముఖ్యం కానీ.. వల్గారిటీ కాదు. దయచేసి ఈ విషయంలో తప్పకుండా అందరూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తూ సురేష్‌గారు మీ దృష్ఠిలో సినిమాకు, ఓటీటీకి తేడా ఏంటి అని అడిగారు.. నేను సినిమా అనేది మనం షాప్‌కు వెళ్లి కొనుక్కునే వస్తువు. ఓటీటీ అనేది ఆన్‌లైన్‌లో కొనుక్కునే వస్తువు అన్నాను. సినిమా సినిమానే.. ఓటీటీ ఓటీటీనే ఎప్పటికీ రెండూ ఒక్కటి కావు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటివి థియేటర్‌లోనే చూడాలి. ప్రస్తుతం ప్రేక్షకుల లైఫ్‌స్టైల్ బిజీ కావడంతో ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
జోష్ రవి మాట్లాడుతూ...
నేను ఊర్లో ఉన్నప్పుడు సంతోషంలో వచ్చే చిరంజీవిగారి అద్భుతమైన కవర్ పేజీలను ఇంటి నిండా అతికించుకునే వాణ్ణి. ఈరోజు అదే సంతోషం అవార్డు అందుకుంటున్నందుకు చెప్పలేని ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ..
సురేష్ గారు సినిమా అవార్డ్స్‌తో పాటు ఇలా ఓటీటీ అవార్డ్స్‌ను కూడా ఇస్తూ ఆర్టిస్ట్‌లను, టెక్నీషియన్స్‌ను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. విజేతలు అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అన్నారు.
యాంకర్ రవి, వర్ష, ఇమ్మానుయేల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్....
వాసవి గ్రూప్స్, జీ స్క్వేర్, టీమ్4, కేశినేని డెవలపర్స్, టీ టైం, కె.కె క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, అక్షర గ్రూప్, మహా న్యూస్, మహా మ్యాక్స్, సంపంగి గ్రూప్, ఆలివ్ మిఠాయి, స్మార్ట్ యాడ్ స్క్రీన్స్, సన్‌టెక్ సోలార్ ఎనర్జీ ప్రోడక్ట్స్, ఆదిత్య మ్యూజిక్, రేడియోసిటీ 91.1, బుక్‌మై షో, అరుణశ్రీ ఎంటర్‌టైనర్స్, వాసవి గ్రూప్.
అవార్డు విన్నర్స్ :
1. బెస్ట్ మూవీ : ప్రేమ విమానం (నిర్మాత అభిషేక్ నామా)
2. బెస్ట్ యాక్టర్ : జె.డి. చక్రవర్తి (దయ)
3. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వేణు తొట్టెంపూడి (అతిథి)
4. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : ఓంకార్ (మేషన్ 24)
5. బెస్ట్ డైరెక్టర్ : ఆనంద్ రంగా (వ్యవస్థ)
6. బెస్ట్ సపోర్టింగ్ డెబ్యూ ఆర్టిస్ట్ : శ్రీనివాస్ గారిరెడ్డి
7. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ : జోష్ రవి (దయ)
8. బెస్ట్ సపోర్టింగ్ నటి : అనసూయ (ప్రేమ విమానం)
9. బెస్ట్ విలన్ : సుహాస్ (యాంగర్‌టెయిల్స్)
10. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్ (నిశానీ)
11. బెస్ట్ సినిమాటోగ్రఫీ : వివేక్ కాలెపు (దయ)
12. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : అనిరుద్, దేవాన్ష్ (ప్రేమ విమానం)