శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన 5కే వాక్
ప్రముఖ కంటి ఆస్పత్రి శంకర నేత్రాలయ యూఎస్ఏ (ఎస్ఎన్‌యూఎస్ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని మిచిగాన్‌లో ఉన్న డెట్రాయిట్ మెట్రో ఏరియాలో 5 వేల కిలోమీటర్ల నడక కార్యక్రమం జరిగింది. ఈ ఆస్పత్రి గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఏటా ఈ 5కే వాక్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమం నోవిలోని ఐటీసీ కమ్యూనిటీ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగింది. ఎస్‌ఎన్‌యూఎస్‌ఏ మిచిగార్ ట్రస్టీ ప్రతిమ కొడాలి, మిచిగాన్ ఛాప్టర్ సీవీపీ రమణ ముదెగంటి, వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, వంశీ గోపిశెట్టి, వెంకట్ ఏక్క, యూత్ మెంబర్స్ అభి ముదెగంటి, ధృతి పదుకోన్ తదితరులంతా కలిసి ఈ 5కే వాక్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ చేపడుతున్న ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతమందికి లబ్ది చేకూరుతుంది? అనే వివరాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా పోస్టర్ బోర్డ్‌లు ఏర్పాటు చేయడం అందర్నీ ఆకట్టుకుంది.