ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ షాక్.. 11న కొత్త పార్టీ..!?

కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ షాక్.. 11న కొత్త పార్టీ..!?

రాజస్థాన్ కాంగ్రెస్ లో ఎంతోకాలంగా విభేదాలున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. 2018 ఎన్నికల సమయంలోనే వాళ్ల మధ్య గ్యాప్ ఉంది. అప్పుడు గెలవగానే ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరువురు నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే అధిష్టానం చివరకు సర్దిచెప్పడంతో సచిన్ పైలట్ వెనక్కు తగ్గారు. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఆ గ్యాప్ ఐదేళ్లయినా అలాగే కంటిన్యూ అవుతోంది. ప్రతి నిర్ణయంలోనూ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు.

నాలుగేళ్లుగా సర్దుకుపోతున్నట్టు కనిపిస్తూ వచ్చిన సచిన్ పైలట్ కొంతకాలంగా వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ తీరును నిరసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ఆ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే అంశాన్ని సచిన్ పైలట్ అస్త్రంగా మార్చుకున్నారు. వసుంధర రాజే ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. అందుకే సచిన్ పైలట్ రెచ్చిపోతున్నారు.

తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేయట్లేదని, పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నానని సచిన్ పైలట్ చెప్తున్నారు. అంతేకాక నిరసన దీక్ష కూడా చేపట్టారు. ఇది సంచలనం కలిగించింది. సొంత ప్రభుత్వంపైనా నిరసన దీక్ష చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఇంత చేస్తున్నా అధిష్టానం ఓపికతో వ్యవహరిస్తూ వచ్చింది. గత వారం కూడా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ను ఢిల్లీ పిలిపించి మాట్లాడింది. సర్దుకుపోయి పని చేస్తే కర్నాటకలో లాగే విజయం సాధించవచ్చని, అప్పుడు అధికారం గురించి చర్చించుకోవచ్చని సూచించారు. అక్కడ సరేనని తలూపి వచ్చారు.

అయితే ఇప్పుడు సచిన్ పైలట్ సొంత పార్టీ ఏర్పాటుకోసం చకచకా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధింతి రోజైన 11న ప్రగతిశీల కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ అనౌన్స్ చేసేందుకు సచిన్ పైలట్ సిద్ధమవుతున్నారు. దౌసా ఇందుకు వేదిక కాబోతోంది. ఈ మేరకు తన అనుచరులందరికీ సచిన్ పైలట్ సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. పైగా సచిన్ పైలట్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ టీం పనిచేయబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకూ అధికారికంగా మాత్రం సచిన్ పైలట్ ఈ విషయం వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన మనుగడ కష్టమని సచిన్ పైలట్ భావిస్తున్నారు. ముఖ్యంగా అశోక్ పైలట్ ఉన్నంతవరకూ తను సీఎం కాలేడు. అలా కాకుండా సొంత పార్టీ పెట్టుకుని ఎక్కువ సీట్లు సాధించగలిగితే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సచిన్ పైలట్ లక్ష్యం. మరి సొంత పార్టీతో సచిన్ పైలట్ తన లక్ష్యాన్ని ఎంతమేర చేరుకుంటారో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :