Radha Spaces ASBL

ఒక దేశాధినేతపై ఆంక్షలు విధిస్తే.. సంబంధాలు తెగదెంపులే

ఒక దేశాధినేతపై ఆంక్షలు విధిస్తే.. సంబంధాలు  తెగదెంపులే

తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగదెంపులైనట్టేనని రష్యా తేల్చి చెప్పింది. పుతిన్‌పైన, రష్యన్‌ బ్యాంకులపైన ఆంక్షలు విధించాలంటూ అమెరికాలోని డెమొకటిక్‌ పార్టీ సెనెటర్లు రంకెలు వేస్తున్న నేపథ్యంలో రష్యా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైతే  అలాంటి ఆలోచనేది లేదు. ఈ విషయంలో అమెరికా విజ్ఞతను ప్రదర్శిస్తుందనే అనుకుంటున్నామని రష్యన్‌ అధ్యక్ష భవనం ప్రతినిధి డిమిక్రి పెస్కోవ్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా కూల్చివేసి, అక్కడ తిష్టవేసేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను పుతిన్‌ వ్యతిరేకించడమే అమెరికా అక్కసుకు కారణం.

ఉక్రెయిన్‌పై రష్యాతో కయ్యానికి అమెరికా కాలుదువ్వుతున్నది. రష్యాపై దాడికి నాటో దళాలను రష్యన్‌ సరిహద్దులకు తరలిస్తూ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నది. దీంతో ఉక్రెయిన్‌తో తనకు గల సరిహద్దు వెంబడి రష్యా తన భద్రతా దళాలను మోహరించింది. తన స్వీయ రక్షణ కోసం తన సరిహద్దు భూ భాగంలో సైన్యాన్ని మోహరిస్తే దానిని దురాక్రమణ యత్నంగా అమెరికా, పాశ్చాత్య మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాన్ని రష్యా ఖండిరచింది. తమ స్వంత భూభాగంలో ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బలగాలు తరలించుకునే హక్కు మాకు ఉంది. దీనిని కాదనే హక్కు అమెరికాకెక్కడిది అని రష్యా ప్రశ్నించించింది. యూరప్‌ మ్యాప్‌ను తిరగరాయాలని అమెరికా యత్నిస్తే అది ఘోర తప్పిదమే అవుతుందని రష్యా హెచ్చరించింది. ఒక దేశాధినేతలపై ఆంక్షలు విధించడమంటే ఆ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం గానే భావిస్తామని డిమిట్రి పెస్కోప్‌ తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :