Radha Spaces ASBL

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌  పాలనలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ చేసిందేమిటో చెప్పకుండా కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిరదని విమర్శించారు. ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌తో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :