విశ్వక్ సినిమాకు రీషూట్స్?
విభిన్న కథలతో సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా కెరీర్లో దూసుకెళ్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్‌సేన్. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్సేన్ ఆ సినిమాలతో మంచి ఫలితాన్నందుకున్నాడు. ఇదిలా ఉంటే విశ్వక్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
రామ్ తాళ్లూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. వాస్తవానికి మెకానిక్ రాకీ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. అవుట్‌పుట్ కూడా బాగానే వచ్చిందంటున్నారు. అయితే ఆడియన్స్ కు మరింత కొత్తదనం ఇవ్వాలని, అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, తన సినిమా మరింత మెరుగ్గా ఉండాలనే కారణంతో విశ్వక్ ఈ సినిమాను రీషూట్ కు తీసుకెళ్లాడని సమాచారం.
కొన్ని సీన్స్ ను మరింత బెటర్ గా తీయడం కోసం మెకానిక్ రాకీని రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ మెకానిక్ షెడ్ సెట్ లో ఈ రీషూట్స్ జరుగుతున్నాయట. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉండటంతో వీలైనంత త్వరగా రీషూట్స్ ను పూర్తి చేసి రిలీజ్ డేట్ కు సినిమాను రెడీ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఒకవేళ షూటింగ్ లేటయితే నవంబర్ నెలలో వద్దామనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.