Radha Spaces ASBL

రీ డెవలప్‌మెంట్‌ పై మోజు చూపుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు

రీ డెవలప్‌మెంట్‌ పై మోజు చూపుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు

గతంలో సిటీ వెలుపల ఉన్న ఖాళీ స్థలాల్లో వెంచర్లు, ప్రాజెక్టులను కట్టేందుకు పోటీపడ్డ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఇప్పుడు సిటీ లోపలే తమ ప్రాజెక్టులను కట్టేందుకు మోజు చూపిస్తున్నాయి. ఎందుకంటే విద్య, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కొత్తగా రీ డెవలప్‌మెంట్‌ కింద కడితే తీసుకునే వాళ్ళు ఎక్కువమంది ఉంటారని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అంటున్నాయి. మంచి డిమాండ్‌ కనిపిస్తున్నందువల్ల ఇలాంటి స్థలాల్లోనే వారికి నచ్చేలా సరికొత్తగా నివాస, వాణిజ్య సముదాయా లను కడితే అమ్ముడుపోతాయని చెబుతోంది.

పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించడం నేడు ఎక్కువగా కనిపిస్తోంది. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్‌ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థలం విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ`డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్‌ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్‌, బేగంపేట, అమీర్‌పేట్‌, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్‌ వంటి పాత రెసిడెన్షియల్‌ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ-డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులే.

తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతోపాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్‌మెంట్‌ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయన్న ఉద్దేశ్యంతో స్థల యజమానులు తమ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇస్తుంటారు. అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుందని బిల్డర్లు అనుకుంటారు. ఇక్కడ కొనుగోలు చేసేవాళ్ళు అభివృద్ధి చెందిన ప్రాంతం దానికితోడు మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ దగ్గరగా ఉందని భావించి కొనుగోలు చేస్తారు.

రీ` డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్‌ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10`15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్‌, ట్రాన్స్‌ఫార్మర్‌, మోటార్‌ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్‌ వసతుల వ్యయం తగ్గుతుంది. అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్‌ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్‌ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది.  అలాగే ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ`డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్‌ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :