ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దేశంలో పెరిగిన రియల్ డిమాండ్

దేశంలో పెరిగిన రియల్ డిమాండ్

కోవిడ్‌ వచ్చిన తగ్గిన తరువాత మళ్ళీ రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ పెరుగుతోంది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు పెరగవచ్చని చెబుతున్నారు. ఈ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌రంగంలో 3 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా కూడా వెల్లడిరచింది. మెరుగైన డిమాండ్‌ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ అవుట్‌లుక్‌ను కూడా సవరించినట్లు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.‘ అధిక అమ్మకాలు, గృహ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం, మెరుగైన స్థోమత, ఎన్నడూ లేనంత తక్కువ గృహ రుణ వడ్డీ రేటు ఈ సవరణకు కారణం. కోవిడ్‌ తర్వాత డిమాండ్‌ వేగంగా పెరగడంతో పూర్తి అయిన ప్రాజెక్టుల ధరను సవరించడానికి ఆస్కారం ఏర్పడిరది. నిర్మాణ వ్యయం పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాజెక్టులు పూర్తి చేసే సమయాన్నిబట్టి ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్‌లలో ఆరోగ్యకరమైన డిమాండ్‌ అవకాశాలు, ధరల సౌలభ్యం.. వెరశి నిర్మాణ సంస్థలకు లాభదాయకత కొనసాగించడంలో సహాయపడతాయి.

గృహ రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుత స్థాయి నుండి 50`75 బేసిస్‌ పాయింట్స్‌ పెరిగినప్పటికీ డిమాండ్‌ స్థిరంగా ఉంటుంది. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడం, స్థిర డిమాండ్‌తో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా ప్రారంభం అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధితో 2022`23లో 40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మెరుగైన డెలివరీ ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న పెద్ద, ప్రసిద్ధ బిల్డర్ల మార్కెట్‌ వాటా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలహీనమైన రియల్టర్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని ఇక్రా వివరించింది.

విలాస ఇళ్లకు భారీ డిమాండ్‌

మరోవైపు దేశంలో అన్నీ నగరాల్లో ముఖ్యంగా ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడిరది. ముంబైలో అయితే రూ.10 కోట్లకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు 2021లో రెండున్న రెట్లు పెరిగాయి. రూ. 20,255 కోట్లు విలువైన యూనిట్లు అమ్ముడుపోయాయి. గృహ రుణాలపై కనిష్ట వడ్డీ రేట్లు ఉండడం పెద్ద ఫ్లాట్లకు డిమాండ్‌ను పెంచింది.  2020లో ముంబైలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు రూ.9,492 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ప్రైమరీ (కొత్తవి), సెకండరీ (రెండోసారి విక్రయానికి వచ్చినవి) కలిసే ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 2021లో ముంబైలో 1,214 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. 2020లో అమ్మకాలు 548 యూనిట్లుగా ఉన్నాయి. ముంబైలోని వర్లి, లోయర్‌ పారెల్‌, బంద్రా, టార్డో, ప్రభాదేవి, అంధేరి ప్రాంతాలు లగ్జరీ ఇళ్లకు కేంద్రాలుగా ఉన్నాయి. మొత్తం విలాస ఇళ్ల విక్రయాల్లో ఒక్క వర్లి ప్రాంతం నుంచి అమ్ముడుపోయేవే 20 శాతంగా ఉంటున్నాయి.

ప్రైమరీ మార్కెట్‌ విలాస ఇళ్ల అమ్మకాలు 2021లో 848 యూనిట్లుగా, వీటి విలువ రూ.13,549 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో అమ్మకాలు 349 యూనిట్లుగాను, విలువ రూ.6,275 కోట్లుగా ఉంది. సెకండరీ మార్కెట్లో 366 విలాస ఇళ్లు గతేడాది అమ్ముడ య్యాయి. వీటి విలువ రూ.6,706 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరంలో 199 యూనిట్లుగాను, విలువ రూ.3,217 కోట్లుగాను ఉంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :