Radha Spaces ASBL

పెద్దనోట్ల రద్దు-2

పెద్దనోట్ల రద్దు-2

రెండు వేల నోటు రద్దు.. దేశ ఆర్థికవ్యవస్థకు చేటు చేస్తుందా? విశ్వగురు తీసుకుంటున్న నిర్ణయాలు శాపంగా పరిణమిస్తున్నాయా? పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుంటున్న దశలో.. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవనుందా? అవుననే అంటోంది విపక్ష కాంగ్రెస్.  మోదీ నిర్ణయాలపై కాంగ్రెస్ , సీపీఐ ఎంపీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

క్లిష్టమైన సొంత శైలి కలిగిన నిర్ణయాలు తీసుకునే విశ్వగురు.. ఫస్ట్ యాక్ట్ తర్వాత థింక్ అనే పద్ధతిని అవలంభిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో జనం నానా అవస్థలు పడ్డారని, వ్యాపారాలు కుదేలైన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

2016 నవంబర్ 8న ప్రధాని మోదీ తుగ్లక్ లాంటి విధానాలను అమలు చేసేదిశగా పెద్దనోట్లు రద్దు చేశారన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం.. రెండువేల నోటు రద్దు అంశంపై తీవ్రంగా స్పందించారు.  పెద్దనోట్ల రద్దు -1 అవివేక నిర్ణయమన్న చిదంబరం... దాన్ని కప్పిపుచ్చేందుకు వేసిన బ్యాండ్ ఎయిడ్ గా దీన్ని అభివర్ణించారు. దీనివల్ల ఆర్థికవ్యవస్థకు ఎలాంటి మేలు చేకూరదన్నారు. సరికదా.. ఇబ్బందులు తప్పవన్నారు.

దేశ ఆర్థికవ్యవస్థను తుగ్లక్ లాంటి మనస్తత్వం కలిగినవాళ్లు కంట్రోల్ చేస్తున్నారని సీపీఐ మండిపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మరింతబలోపేతానికి ఉపయోగపడుతుందని.. కొందరు మభ్యపెట్టే  అవకాశముందన్నా్రు.ఇదిలాగే కొినసాగితే, 2వేల నోటుకు బదులు తెల్లకాగితాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుత సర్కార్ సాహసించే ప్రమాదముందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ ఆరోపించారు.

అయితే మరికొందరు మాత్రం ..డిజిటలైజేషన్ కొనసాగుతున్న నోట్ల వినియోగం కూడా పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందువల్లే పెద్దనోట్ల రద్దు-2 నిర్ణయానికి ఆర్బీఐ వచ్చిందని చెబుతున్నారు. ఏదేమైనా నోట్ల రద్దు అంశం మరోసారి దేశ రాజకీయాల్ని కంపింప చేయనుందన్న అంశంలో ఎలాంటి అనుమానం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :