ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2 వేల నోట్ల పై... ఆర్ బీఐ కీలక నిర్ణయం

2 వేల నోట్ల పై... ఆర్ బీఐ కీలక నిర్ణయం

రూ.2 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఆర్‌బీఐ ఉపసంహరించుకోనుంది. రూ.2 వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :