మైత్రీతో మాస్ మహారాజా మూవీ
ధమాకా, వాల్తేరు వీరయ్యలతో సక్సెస్ అందుకున్న రవితేజ, రీసెంట్‌గా వచ్చిన రావణాసురతో నిరాశ పరిచాడు. సినిమా ఆడకపోయినా రవితేజ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ మైత్రీ నిర్మాతల బాకీ తీర్చనున్నాడని టాక్.
అవును నిజమే.. గతంలో రవితేజ, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసి ఆ బ్యానర్‌కు దారుణమైన డిజాస్టర్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. మంచి కథ, డైరెక్టర్ దొరికితే మైత్రీ బ్యానర్లో మరో సినిమా చేస్తానని రవితేజ అప్పట్లోనే మాటిచ్చాడట. ఇప్పుడు ఆ మాటనే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు మాస్ మహారాజా.
మైత్రీ బ్యానర్‌కు ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి రూపంలో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీ చంద్ మలినేనితో రవితేజ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ తో గోపీచంద్ డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీని గోపీ, రవితేజకు చెప్పాడని, కథ నచ్చిన రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవగానే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్సుంది. మరి ఈ సారైనా రవితేజ మైత్రీ బ్యానర్‌కు హిట్ ఇస్తాడేమో చూడాలి.