యాదాద్రిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వర్ణ రథంపై మాఢవీధుల్లో స్వామివారు ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Tags :