ASBL Koncept Ambience
facebook whatsapp X

మిస్ ఫైర్ అయిన రానా, తేజ కామెడీ

మిస్ ఫైర్ అయిన రానా, తేజ కామెడీ

రీసెంట్ గా అబుదాబిలో జ‌రిగిన ఐఫా అవార్డ్(IIFA Awards) ఈవెంట్ కు రానా ద‌గ్గుబాటి(Rana Daggubati), తేజ స‌జ్జ(Teja Sajja) హోస్టింగ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇది లైవ్ ఈవెంట్ కాక‌పోవ‌డంతో అక్క‌డ వెళ్లిన వారికి త‌ప్ప ఏం జ‌రిగింద‌న్న‌ది ఇండియాలోని ఫ్యాన్స్ కు తెలిసే ఛాన్స్ లేక‌పోయింది. తాజాగా యూట్యూబ్ లో ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ కు వ‌చ్చింది.

అయితే ఈ ఈవెంట్ మొత్తంలో రానా, తేజ చేసిన సెటైరిక్ కామెడీ ఇప్పుడు ఇత‌ర హీరో ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. ఈవెంట్ కు వ‌చ్చిన వారిని న‌వ్వించ‌డంలో భాగంగా తేజ‌, రానా కొన్ని జోక్స్ వేశారు. అందులో సంక్రాంతికి పోటీ ప‌డిన గుంటూరు కారం(Gunturu Karam), హ‌ను మాన్(hanu man) క్లాష్ గురించి కూడా ఉంది. ఇప్పుడు మ‌హేష్ ను ఏమీ అన‌క‌పోయినా గ‌తంలో పండ‌గ విజేత‌గా తేజ గురించి కొంద‌రు చేసిన ప్ర‌చారం మ‌హేష్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన విష‌యం తెలిసిందే.

ఆదిపురుష్(Adhipurush) థియేట‌ర్ల‌లో హ‌నుమంతుడి కోసం ఒక సీట్ వ‌దిలేస్తే ఆయ‌న ఓటీటీలో చూద్దామ‌ని వ‌దిలేశాడ‌ని చెప్ప‌డం ప్ర‌భాస్(Prabhas) ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌(Mr. Bachan)ను ఉద్దేశించి కూడా రానా పంచ్ వేశాడు. బాల‌య్య‌(Balakrishna)తో ఫోన్ కాల్ లాంటివి కామెడీగా అనిపించిన‌ప్ప‌టికీ మిగిలినవి కొంచెం మిస్ ఫైర్ అయ్యాయి. ఇలాంటి ఎంట‌ర్టైన్మెంట్ యాంక‌రింగ్ బాలీవుడ్ లో చాలా కామ‌న్. షారుఖ్(Shahrukh) నుంచి పంక‌జ్(Pankaj) వ‌ర‌కు అంద‌రి మీద పంచులేసినా ఎవ‌రూ ఫీల్ అవ‌రు. కానీ మ‌న‌కు ఇది చాలా కొత్త కావ‌డంతో రానా, తేజ చేసిన కామెడీని ఆయా హీరో ఫ్యాన్స్ లైట్ తీసుకోలేక‌పోతున్నారు.   

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :