బే ఏరియలో అలరించిన రామ్ మిరియాల సంగీత కచేరి

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సంగీత కచేరి విజయవంతమైంది. టాలీవుడ్‌లో పాపులర్ గాయకుడిగా పేరు పొందిన రామ్ మిరియాల బే ఏరియా ప్రవాసులను తన పాటలతో మైమరపింపజేశారు. దాదాపు 1000 మందికిపైగా సంగీత ప్రియులు ఈ కచేరీకి హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సంగీత కచేరీకి అసోసియేట్ స్పాన్సర్ రియల్టర్ ‘నాగరాజ్ అన్నయ్య’ వ్యవహరించారు. ఇతర స్పాన్సర్‌లుగా ఐసిఐసీఐ బ్యాంక్, శ్రీ ఫైన్ జ్యువెల్స్ అండ్ కర్రీ పాయింట్ (శాన్ మాటియో), ఈ కార్యక్రమానికి తానా తెలుగు పాఠశాల మద్దతు ఇచ్చింది. మీడియా భాగస్వామి-విరిజల్లు రేడియో వ్యవహరించింది.
రామ్ మిరియాల, ఆయన బృందం ‘‘మాయ మాయ’’, చిట్టి నీ నువ్వంటే, భీమ్లా నాయక్, డిజె టిల్లు, అలయ్ బలాయ్ .. మొదలైన సూపర్ డూపర్ హిట్ పాటలను అందించింది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. చాలా తక్కువ మంది తమ సీట్లలో కూర్చున్నారు, అందరూ డ్యాన్స్ ఫ్లోర్‌లోనే ఉంటూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం విశేషం.
బాటా యూత్ టీమ్ సభ్యులు కొన్ని తాజా హిట్ పాటలకు నృత్యాలు అందించారు.
ఎస్‌ఎఫ్‌ఓ ఇండియన్ కాన్సులేట్ జనరల్ డా. టీ.వి. నాగేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరై రామ్ మిరియాల బృందాన్ని అభినందించారు.
బాటా అధ్యక్షుడు హరినాథ్ చికోటి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వలంటీర్లకు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు.
బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు కొండల్ రావు (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి, వరుణ్ ముక్క, శివ కడ.
‘స్టీరింగ్ కమిటీ’ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి
కల్చరల్‌టీమ్ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి మరియు తారక దీప్తి.
నామినేటెడ్ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు, సంకేత్, సందీప్.
యూత్ కమిటీ సభ్యులు ఆదిత్య, హరీష్, ఉదయ్, క్రాంతి.
బాటా సలహా సంఘం సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా విజయవంతం చేసిన బృందానికి అభినందనలు తెలిపారు.
సతీష్ వేమూరి (తానా సెక్రటరీ), రామ్ తోట (తానా ఆర్‌ఆర్ నార్తర్న్ కాలిఫోర్నియా) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.