సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో మెగా ప్రాజెక్ట్స్ చేస్తున్న రామ్ చరణ్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో మెగా ప్రాజెక్ట్స్ చేస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తన 15న వ సినిమాను చేస్తున్నాడు. త‌దుప‌రి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నారు. దాని త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ డైరెక్ష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన లైనప్‌లో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలను చరణ్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ దశలో ఉంది. మరో సినిమా మొదలవ్వాల్సి ఉంది.

తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చరణ్‌కు సంబంధించిన రెండు రకాల గెటప్స్ వచ్చి వైరల్ అయ్యాయి.కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి, జయరాం, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ లెవల్‌లో తెలుగు, హిందీతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమాను కమిటయ్యాడు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

అయితే ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తోన్న చరణ్ ఇప్పుడు మరో తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతనే లోకేష్ కనగరాజ్. కార్తితో తీసిన ఖైదీ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ ఆ తర్వాత విజయ్‌కు భారీ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో విక్రమ్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నట్టు తాజా సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. చెర్రీ తన సినిమాలను పక్కా ప్లానింగ్‌తో సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెడుతున్నారు.

లోకేష్ కనగరాజ్‌కి సక్సెస్‌పుల్ సినిమా డైరెక్టర్‌గా ఇమేజ్ వచ్చింది. ఈయన చరణ్‌తో సినిమా అంటే నెక్ట్స్ రేంజ్ మూవీగా ఉంటుందనడంలో సందేహామే లేదు. అయితే ఈ ప్రాజెక్ట్స్ వెంటనే స్టార్ట్ అవుతుందా? అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటికే లైన్‌లో గౌతమ్ వెయిటింగ్‌లో ఉన్నారు. మరో వైపు సుకుమార్‌తో చరణ్ సినిమా ఉంటుందనే వార్తలు లేకపోలేదు. ఈ మూడు సినిమాల్లో ఏది ముందు చేసిన మెగా ఫాన్స్ కి పండగే!

 

 

Tags :