విదేశాల్లో చరణ్ స్పెషల్ ట్రైనింగ్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందే చరణ్ తన తర్వాతి సినిమాను బుచ్చి బాబుతో చేయడానికి రెడీ అయ్యాడు. స్టోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠోర శ్రమ పడుతున్నట్లు తెలుస్తోంది.
చరణ్ ఈ నెల మొదట్లోనే ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ అథ్లెటిక్ లుక్ కోసం చరణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ, వర్కౌట్స్ చేస్తున్నాడట. ఇంటర్నేషనల్ లెవెల్ అథ్లెట్స్ కు ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ ట్రైనర్ దగ్గర చరణ్ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. అక్కడ మొత్తం నాలుగు వారాల ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చాక చరణ్ బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేయనున్నాడట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పల్లెటూరు సెట్ ను నిర్మిస్తున్నారట. కోట్ల రూపాయలతో భారీగా నిర్మిస్తున్న ఆ సెట్ లోనే ఈ మూవీకి సంబంధించిన మెజారిటీ సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఓ పల్లెటూరు అథ్లెట్ గా బుచ్చిబాబు ప్రెజెంట్ చేయనున్నాడట. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా స్పెషల్ గా ఉంటుందని అందరూ చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.