రామ్ చరణ్ కి అరుదైన గౌరవం

అమెరికా పాపులర్ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో సందడి చేయనున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ టీవీ షోలో సందడి చేయబోతున్న తొలి టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ కావడం విశేషం. ఈ షోలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు రామ్‌చరణ్. భారత కాలమానం ప్రకారం ఏబీసీ ఛానల్‌లో ఇవాళ రాత్రి 11:30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోలో చరణ్ తన వ్యక్తిగత, వృతిపరమైన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags :